Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ చందమామ.. 2020 చివర్లో చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. కరోనా నిబంధనల కారణంగా కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలు చేసిన కాజల్.. త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఆస్వాదిస్తోంది. అలాగే పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రతి రోజు వర్కవుట్లు కూడా చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా కాజల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. `నేను ఎప్పుడూ చురుగ్గానే ఉంటాను. ఎప్పుడూ వర్కవుట్స్ చేస్తాను. కానీ గర్భం దాల్చడం అనేది కొత్త అనుభవం. ఎటువంటి సమస్యలు లేకుంటే గర్భవతిగా ఉన్న మహిళలందరూ సుఖ ప్రసవం కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఇంత ఫిట్‌గా ఉండటానికి ఈ ఏరోబిక్స్ నాకు ఎంతో సాహాయపడుతున్నాయి` అంటూ కూడా రాసుకొచ్చింది. ఇక తాజా వీడియోలో బేబీ బంప్‌తో ఉన్న కాజల్ తన ట్రైనర్‌తో కలిసి ఏరోబిక్ మరియు స్ట్రెంగ్త్ కండిషనింగ్ వ్యాయామాలు చేస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి దానిపై మీరూ ఓ లుక్కేసేయండి.
https://www.instagram.com/reel/Cag262RBpRm/?utm_source=ig_web_copy_link
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!