Kajal Aggerwal- Hansika Motwani- Tamannah Bhatia : కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ఎక్కువగా లేని సమయంలో ఈ సినిమా సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే కేవలం పేపర్లు మాత్రమే చూడాలి. వారు ఎలాంటి డ్రెస్ ధరించారు.ఏ విధంగా ముస్తాబయ్యారు అనే విషయాలన్నీ కేవలం పేపర్లో మాత్రమే చూసి తెలుసుకునేవారు. మరి కొద్ది రోజులకు ఏదైనా వేడుకకు సెలబ్రిటీలు హాజరు అవుతున్నారు అంటే వారు రెడ్ కార్పెట్ పై ఏ విధంగా ఈ వేడుకకు హాజరవుతారనే ఆత్రుత ఎంతోమంది అభిమానులకు ఉండేది.కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువగా అభివృద్ధి చెందటం వల్ల సినీ తారల గురించి ఎప్పటికప్పుడు వారి విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు .
సినిమా సెలబ్రిటీస్ గడప నుంచి కాలు బయట పెట్టడం ఆలస్యం వారి ఫోటోలను ఎవరో ఒకరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ క్షణాల్లో ప్రపంచం మొత్తం వారిని చూసే విధంగా చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ కాలు బయట పెట్టిన సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ సినీ తారలు ఏ పార్టీ కి వెళ్తారు అనే విషయాలను తెలుసుకొని బయట వారి కోసం ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు కాపలా కూర్చుంటారు. వారు బయటకు రావడమే ఆలస్యం వెంటనే వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.
ఈ ముగ్గురిలో ఎవరు స్టైలిష్ గా ఉంటారు
ఇకపోతే చాలామంది ఫోటోగ్రాఫర్లు ఎయిర్ పోర్టు ముందు తిష్ట వేసుకొని సెలబ్రిటీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ ట్రావెల్ స్టేషన్ లోకి రావడమే ఆలస్యం వారి ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నడంతో ప్రస్తుతం హీరోయిన్లు బయటకు వెళితే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తమన్నా, హన్సిక, కాజల్ .. ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వెళ్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు స్టైలిష్ గా, ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ ఉంటారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ముగ్గురిలో ఎవరు స్టైలిష్ గా కనిపిస్తారు అనేది అభిమానులే డిసైడ్ చేయాలి.