Kajal : “లక్ష్మీకళ్యాణం” సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ రెండో సినిమా “మగధీర” తో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. “మగధీర” ఇచ్చిన విజయానికి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చాన్సులు అందుకుంటూ ..సౌత్ లోనే తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకుంది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ పెద్దగా రాణించలేక పోవడంతో ప్రస్తుతం సౌత్ లో సినిమాలు చేసుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సరిగ్గా లాక్ డౌన్ టైం లో కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి ఫామ్ లో ఉన్న స్టార్ హీరోల పక్కన అవకాశాల కంటే సీనియర్ హీరోల పక్కనే.. ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తాజాగా ఇండస్ట్రీలో మరో సీనియర్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ అందుకున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
మేటర్ లోకి వెళ్తే కింగ్ “గరుడ వేగా” సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించబోయే సినిమాలో .. కాజల్ అగర్వాల్ హీరోయిన్ ఛాన్స్ అందుకున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. ఇప్పటికే డైరెక్టర్ మంతనాలు కూడా జరిపినట్లు అంతా ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం నాగార్జున లేటెస్ట్ సినిమా “వైల్డ్ డాగ్” ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇటీవల కరోనా వైరస్ మొదటి వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. దీంతో త్వరలోనే “వైల్డ్ డాగ్” సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ తర్వాత వెంటనే ప్రవీణ్ సత్తారు సినిమా విశేషాలు అధికారికంగా ప్రకటించాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!