మన చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంటోంది. వీరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. వీరి ఎంగేజ్ మెంట్ అయిందనే వార్తలు కూడా విన్నాం. అయితే వీరు అక్టోబర్ 30 న పెళ్లి పీటలెక్కనున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
ఈ నేపథ్యంలో వారి వారి ఇళ్లల్లో ఇంటి అలంకరణలో పడ్డారిద్దరు. ఇంతకు ముందు కూడా కాజల్ మా ఇల్లు ఎలా ఉంది.. దీనికి సంబంధించి మీరేమైనా సలహాలు ఇవ్వగలరా అని సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసింది. అది కాస్త సోషల్ మీడియాను ఊపేసింది. ఒకరికొకరు తోడుగా ఉండబోయే ఈ జంట తమ జీవిత భాగస్వామిని ఆకట్టుకోవడానికి కాజల్ సిద్ధమైనట్టుంది.
ఈ సందర్భంగా ఆమె తన చేతివేళ్లను చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె వేలికి కనిపిస్తున్న డైమండ్ రింగ్ అందరినీ ఆకర్షించింది. దానితో పలువురు కామెంట్ చేశారు. ఆ డైమండ్ రింగ్ నిశ్చితార్థందే అయి ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. తమ ఎంగేజ్మెంట్ రింగ్ చాలా అందంగా ఉందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా గౌతమ్ కిచ్లు కూడా తమ బట్టల ఎంపిక విషయంలో సోషల్ మీడియాలో తాజాగా ఒక పోస్ట్ ను కూడా పెట్టారు. నా పెళ్లి దుస్తులను ఏ డిజైనర్స్ సిద్ధం చేస్తున్నారనుకుంటాన్నారని ఆయన నెటిజన్లకు క్వశ్చన్ వేశారు. ఇదిలా ఉండగా జంటగా ఉండబోతున్న కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ ల కోసం తమ ఇంటిని అలంకరించే పనిలో పడ్డారు వరుడు గౌతమ్ కిచ్లు.