వైరల్ గా మారిన కాజల్ వెడ్డిండ్ ఫోటో షూట్.. మీరు చూశారా ?

Share

కరోనా కారణం వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలకు చెందిన పరిశ్రమలు మూతపడ్డాయి. సినిమా రంగంలో కూడా చిత్రీకరణ జరుగుతున్న సినిమాలన్నీ కరోనా వల్ల వాయిదా పడ్డాయి. అయితే కరోనా సమయంలో నితిన్, దిల్ రాజు, నిఖిల్, రానా నా వంటి ప్రముఖ సినీ హీరోలు కరోనా సమయంలో కొద్ది మంది సమక్షంలో మాత్రమే పెళ్లి వేడుకలను జరుపుకున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న మెగా డాటర్ నిహారిక కూడా డిసెంబర్ లో పెళ్లిపీటలెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ తరహాలోనే తెలుగు సినిమా అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి ఈనెల 30వ తేదీన గౌతమ్ తో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. గౌతమ్ ముంబైలో ఓ ప్రముఖ వ్యాపార వేత్త, ఇంటీరియర్ డిజైనర్ కావడంతో వీరిద్దరి మధ్య పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం జరగనుంది. అయితే ఇప్పటికీ పెళ్లి పనులు ఎంతో హడావిడిగా ఉన్నా కాజల్. ఇప్పటికే తమ సొంత ఇంటిని ఎంతో అందంగా డిజైన్ కూడా చేయించారు.

అక్టోబర్ 30న ముంబైలో సెవెన్ స్టార్ హోటల్ లో జరగబోయే వీరి పెళ్లికి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి .దీంట్లో భాగంగానే కాజల్ అగర్వాల్ తన కాబోయే భర్త గౌతమ్ తో కలిసి ఫోటో షూట్ నిర్వహించారు. ఇద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి తీసుకున్న ఫోటో కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది. కాజల్ తల్లిదండ్రులు కొద్దిమంది సమక్షంలోనే ఎంతో ఘనంగా కాజల్ పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతుంది తన అభిమానులను ఆకర్షిస్తుంది.


Share

Related posts

కొత్త కుంప‌టి

Siva Prasad

బిగ్ బాస్ 4 : సోది లవ్ స్టోరీలతో చచ్చిపోయిన ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ న్యూస్…!

arun kanna

బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ మిస్సింగ్.. మెగా ఫ్యామిలీ, పీకే ఫ్యాన్స్ మీదనే డౌట్..!

Varun G