Kalaavathi Song: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సినిమా మే 12వ తారీకు వేసవి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు ఫస్ట్ సింగల్ రిలీజ్ కావడం జరిగింది. “కళావతి” సాంగ్ కొద్ది గంటల క్రితం విడుదల కాగా.. మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
మెలోడీ రూపంలో తమన్ అందించిన మ్యూజిక్ … సంగీత ప్రియులను అలరిస్తోంది. ఇదిలా ఉంటే విడుదలైన కొద్ది నిమిషాలకే అత్యధిక 100 లైకులు.. అదేవిధంగా 200, 300 లైకులు సాధించిన టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాగా సరికొత్త రికార్డ్ సర్కారు వారి పాట సినిమా “కళావతి” సాంగ్ క్రియేట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దాదాపు రెండు సంవత్సరాలు మహేష్ సినిమా రిలీజ్ కాకుండా గ్యాప్ రావడంతో… “సర్కారు వారి పాట” కోసం మహేష్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పైగా సినిమా మరో “పోకిరి” మాదిరి ఉంటుందని.. మహేష్ బాబు చేసిన కామెంట్లు… సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. ఈ షెడ్యూల్ ఈ వారంలోనే స్టార్ట్ కానున్నట్లు దీంతో మహేష్… సర్కారు వారి పాటకి ప్యాకప్ చెప్పనున్నట్లు సమాచారం. ఆ తర్వాత వెంటనే మార్చి మొదటి వారం లేదా రెండో వారం నుండి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నట్లు ఫిలిం నగర్ టాక్.