సినిమా

Mahesh Babu: సర్కారు వారికి కళ తెచ్చిన ‘కళావతి’ పాట.. రికార్డ్స్ మోత షురూ!

Share

Mahesh Babu: ప్రిన్స్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా, పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”సర్కారు వారి పాట”. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. దాంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు మంచి జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన పాటలు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ చిత్రానికి SS థమన్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన 3 పాటలు రికార్డు స్థాయి వీక్షణలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ‘కళావతి’ పాట, సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలవడం కొసమెరుపు.

Kalavathi Songs gets Huge Records For Mahesh Babu 's Sarkaru Vari Pata Movie
Kalavathi Songs gets Huge Records For Mahesh Babu ‘s Sarkaru Vari Pata Movie

కళావతి రికార్డులు ఇవే

ఇప్పటికే ఈ పాట అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించిన ఫస్ట్ సింగిల్ గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు 150 మిలియన్ల వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ పాటకు యూట్యూబ్ లో ఇప్పటివరకు 1.9M+ లైక్స్ రావడం గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాగే ‘కళావతి’ పాట.. వివిధ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్లలో కూడా మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచి, తన ఉనికిని చాటి చెప్పింది. థమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ తనదైన శైలిలో ఆలపించారు. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు.

Kalavathi Songs gets Huge Records For Mahesh Babu 's Sarkaru Vari Pata Movie
Kalavathi Songs gets Huge Records For Mahesh Babu ‘s Sarkaru Vari Pata Movie

సినిమా విశేషాలు

ఈ సినిమాతో ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకోనున్నారు. కళావతి తరువాత వచ్చిన ‘పెన్నీ’ సాంగ్ మరియు టైటిల్ ట్రాక్ కూడా సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ సినిమాలోని ఫోక్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అలానే త్వరలో పవర్ ఫుల్ ట్రైలర్ కట్ రిలీజ్ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Share

Related posts

సుశాంత్ సింగ్ కేసు : ఆ రోజు మధ్యాన్నం సుశాంత్ వాట్సాప్ బ్లాక్ చేసిన రియా .. ఏమైంది అసలు ? 

sekhar

Prabhas: రిస్కు చేయడంలో ప్రభాస్ కి సాటే లేరు.. మిగతా హీరోలకి అంత సీన్ లేదా?

Ram

Jagapathi Babu: 60వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌ప‌తి బాబు..నెటిజ‌న్లు ఫిదా!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar