తమ్ముడిని పిలవడమే ఎక్కువ?

నందమూరి కుటుంబం… అన్నగారి మరణం తర్వాత విడిపోయి, ఎవరిపాటికి వాళ్లు అయిన కుటుంబం. అభిమానులు కూడా బాలయ్య అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా విడిపోయి మరీ మాటల యుద్ధం వరకూ వెళ్లారు. పబ్లిక్ గానే ఎన్నోసార్లు నందమూరి కుటుంబంలో ఉన్న గొడవలు బయటపడ్డాయి, అయితే హరికృష్ణ మరణంతో అంతా మారిపోయింది. నందమూరి కుటుంబం కలిసిపోయింది, ముఖ్యంగా బాబాయ్ బాలకృష్ణ, తండ్రి స్థానంలో నిలబడి అబ్బాయిలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకి అండగా నిలుస్తున్నాడు. గత కొంత కాలంగా ఏ ఫంక్షన్ జరుగుతున్న కలిసి వేదిక పంచుకుంటున్న ఈ ముగ్గురు రీసెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ లో కూడా సరదాగా కనిపించి నందమూరి అభిమానులని ఆనందపరిచారు.
ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చలేదు, అది కాస్త పక్కన పెడితే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నాడు. నిజానికి మొదట్లో హరికృష్ణ పాత్ర నిడివి చాలా తక్కువ, అయితే హరికృష్ణ మరణం తర్వాత ఆ పాత్ర నిడివి పెంచి కళ్యాణ్ రామ్ తో చేయిస్తున్నారు. అన్నగారి సినీ జీవితంలో హరికృష్ణ పాత్ర పెద్దగా ఉండడము కాబట్టి కథానాయకుడు సినిమాలో కళ్యాణ్ రామ్ తక్కువగానే కనిపిస్తాడు కానీ మహానాయకుడులో మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. నందమూరి తారక్ రామారావ్ జీవితాన్ని ప్రపంచానికి చాటిచెప్పే రేంజులో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తాడని అప్పట్లో చాలా వార్తలు బయటికి వచ్చాయి అయితే అవి కేవలం రూమర్స్ మాత్రమే అని తేలడంతో తారక్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఎన్టీఆర్ ఉంటే బాగుండేదని వాళ్లు భావిస్తున్నారు, ఇదే విషయమై కళ్యాణ్ రామ్ ని అడిగితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలో, ఎంత డ్యూరేషన్ తో ఇవ్వాలో ముందే నిర్ణయించారు, అన్నీ దర్శకుడుబాబాయ్ కలిసి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి తారక్ లేకపోవడం అనేది కావాల్సి చేసింది కాదు, తన రేంజ్ పాత్ర సినిమాలో లేనందుకే ఎన్టీఆర్ సినిమాలో తారక్ నటించలేదు అంతే కానీ పెద్ద కారణాలేమీ లేవు, అయినా ఏదో మొక్కుబడి కోసం తెరపై కనిపించి… ఆ తర్వాత ఎన్టీఆర్ కి చాలా చిన్న రోల్ ఇచ్చారు అనిపించుకోవడం కూడా మంచిది కాదు. ఇవన్నీ ఆలోచించే ఈ సినిమాలో తారక్ ని తీసుకోలేదని చెప్పాడు.
ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా కూడా చివరగా కళ్యాణ్ రామ్ చెప్పిన ఒక మాటే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటి అంటే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకే ముఖ్య ఘట్టమైన ఆడియో లాంచ్ కి ఎన్టీఆర్ వచ్చాడు, అక్కడ అంతమంది పెద్దవాళ్లు ఉన్నా కూడా చిన్నవాడని చూడకుండా, బాబాయ్ తారక్ తో ఆడియో లాంచ్ చేయించాడు.. నిజానికి ఆ ఆడియో లాంచ్ కి పిలవడమే ఎక్కువ. అలాంటిది తమ్ముడే పాటల విడుదల చేయడం గొప్ప విషయం అన్నాడు. అయితే ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆడియో లాంచ్ చేయించారు బాగానే ఉంది కానీ, ఆడియో లాంచ్ పిలవడమే గొప్ప అనే మాటే ఎవరికీ అంతు చిక్కట్లేదు. కుటుంబంలో ఇంకా మనస్పర్థలు ఉన్నాయని చెప్తున్నాడా లేక మాట తడబడిందా అనేది తెలియదు కానీ కళ్యాణ్ రామ్ మాటలు విన్న వాళ్లు మాత్రం, నెగటివ్ గానే తీసుకుంటున్నారు.