కొత్త దర్శకుడు వేణు వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘బింబిసార’ ఆగస్టు 5వ తారీఖు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూలై 29వ తారీకు హైదరాబాద్ శిల్పకళ వేదికలో ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్..’బింబిసార’ తెలుగు సినిమా రంగంలోనే చిరస్థాయి సినిమాగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో కూడా హైలెట్ సినిమా అవుతుందని తెలిపా రు.
ఇదిలా ఉంటే ఇటీవల ‘బింబిసార’ పార్ట్ 2 రాబోతున్నట్లు దానిలో ఎన్టీఆర్ ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో వస్తున్న వార్తలపై కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ‘బింబిసార’ పార్ట్ 2 అనే ఆలోచన ఎవరికీ లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఉన్నట్లు వస్తున్న వార్తలు అంతా ఊహాగానాలు మాత్రమే అని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. నేనెప్పుడూ కథని కథలాగే చూస్తాను. దానిలో డివియేషన్ చేయాలని అసలు చూడను.
‘బింబిసార’ పార్ట్ 2 చేయాలని కాదు గాని ఒక ఫ్రాంచైజీ సినిమా లాగా.. చేయాలని అనుకుంటున్నాం. ఉదాహరణకు “స్పైడర్ మాన్” తరహాలో. “స్పైడర్ మాన్ 2” ఒకలా ఉంటే అంతకుముందుది మరోలా ఉంటుంది. అదే రీతిలో ‘బింబిసార’ స్టోరీ టైం ట్రావెలర్ కాన్సెప్ట్ కలిగింది. సో ఈ సినిమాని ఎలాగైనా తీసుకునే అవకాశం ఉంది. ‘బింబిసార 2’ చేసే అవకాశం ఉన్న.. మొదటి పార్ట్ పై ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి రెండో భాగం గురించి ఆలోచిస్తామని కళ్యాణ్ రామ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.