NewsOrbit
Entertainment News సినిమా

ఎన్టీఆర్ తో గ్యారెంటీ గా పాన్ ఇండియా సినిమా చేస్తా కళ్యాణ్ రామ్ వైరల్ కామెంట్స్..!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నదమ్ములనేది అందరికీ తెలుసు. కళ్యాణ్ రామ్ నటనపరంగా హీరోగా రాణిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా విజయవంతంగా రాణిస్తున్నారు. తమ్ముడు ఎన్టీఆర్ తో ఇప్పటికే పలు సినిమాలు నిర్మాతగా నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల తాజాగా తన “బింబిసారా” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kalyan ram gave statement i will do pan india project with ntr

తమ్ముడు తారక్ తో ఓ పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో యాంకర్ మనం తరహా సినిమా నందమూరి ఫ్యామిలీ నుండి ఆశించవచ్చా అని ప్రశ్నించగా… ఖచ్చితంగా తాము కలిసి సినిమా చేయటానికి రెడీ గానే ఉన్నామని స్పష్టం చేశారు. అంతేకాదు ఒక మంచి స్టోరీ దొరికితే బాబాయ్ బాలకృష్ణ తో కూడా సినిమా చేయటానికి రెడీగా ఉన్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించారు. ఈ క్రమంలో బింబిసారా ఇతర భాషల్లో విడుదల చేయకపోవటానికి గల కారణాలు కూడా తెలియజేశారు. ఈ ప్రాజెక్టు సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం అనగా కోవిడ్ రాకముందు ప్రారంభించాం.

Kalyan ram gave statement i will do pan india project with ntr

ఆ టైంలో ఇతర భాషల్లో చేయాలన్న ఆలోచన లేదు. అయితే ఇప్పటికీ ఇప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే చాలా కసరతులు చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అదేవిధంగా ప్రమోషన్స్ కి ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. అంత టైం లేకపోవడం వల్ల కేవలం తెలుగు భాషలోనే విడుదల చేస్తున్నట్లు కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. “బింబిసారా” తెలుగులో మంచి విజయం సాధిస్తే అప్పుడు మిగతా భాషల్లో విడుదల చేసే విషయంపై ఆలోచన చేస్తానని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. “బింబిసారా 2” కూడా రెడీగా ఉందని చెప్పుకోచ్చారు. వంశీ వశిష్ట అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 5వ తారీఖు విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ చాలా వైవిధ్యంగా కెరియర్ లో ఫస్ట్ టైం కనిపిస్తూ ఉండటంతో “బింబిసార” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

చిరంజీవి లో ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకు .. అని వాళ్ళంతా తలలు బాదుకుంటున్నారా..?

GRK

Prabhas : ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమా..?

GRK

Samantha: రిస్క్ వ‌ద్ద‌నుకుంటున్న‌ స‌మంత‌.. ఆ పోటీ నుంచి ఔట్‌..?!

kavya N