Entertainment News సినిమా

“బింబిసార” హిట్ నేపథ్యంలో భావోద్వేగానికి గురైన కళ్యాణ్ రామ్..!!

Share

కొత్త దర్శకుడు వంశీ వశిష్ట దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేరకెక్కిన “బింబిసార” ఇటీవల విడుదలై సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. “బింబిసార” థియేటర్ లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రావడంలేదని వస్తున్న వార్తలకు “బింబిసార” చెక్ పెట్టినట్లయింది. ఈ సినిమా విజయం సాధించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రవితేజ, అల్లు అర్జున్ ఇంకా చాలామంది సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.

Kalyan Ram got emotional after the hit of Bimbisara..!!

నిర్మాత దిల్ రాజు కూడా “బింబిసార” పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సినిమా హిట్ అవ్వడంతో తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన కళ్యాణ్ రామ్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కష్టపడతానన్నారు. “బింబిసార” తో అద్భుతమైన ఘనవిజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో “బింబిసార”కి ప్రాణం పోశారని కొనియాడారు. నాకు పునర్జన్మ ఇచ్చిన సినిమా “బింబిసార” అని కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kalyan Ram got emotional after the hit of Bimbisara..!!

సినిమా విజయం సాధించడంతో కలెక్షన్ లు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ “బింబిసార” సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రాజుల కాలంనాటి పాత్రలో మరియు మోడరన్ కాలనాటి పాత్రలో కళ్యాణ్ రామ్ రెండు విధాలుగా అద్భుతంగా స్క్రీన్ మీద నటించారు. పౌరాణిక పాత్రలు చేయటంలో నందమూరి హీరోల నటన తీరు వేరు అని “బింబిసార” తో మరోసారి కళ్యాణ్ రామ్ రుజువు చేశారు.


Share

Related posts

Jalsa: రీ రిలీజ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ “జల్సా”..!!

sekhar

చాలా మంది తెలుగు నటులకు లభించని అరుదైన గౌరవం బాలకృష్ణ కి దక్కిందిగా ..!

GRK

Anupama Parameswaran traditional Looks

Gallery Desk