సినీ పరిశ్రమ పరిశ్రమలో హీరోలు హీరోయిన్ల ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. కృష్ణ – విజయ నిర్మల, నాగార్జున – అమల, రాజశేఖర్ – జీవిత, మహేష్ బాబు – నమ్రత ఇలా పాతతరం జంటలు చాలానే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కొన్ని జంటలను చూద్దాం.
సమంత నాగ చైతన్య
2009లో జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి తెరంగ్రేటం చేశారు అక్కినేని నాగ చైతన్య. హీరోగా, హీరోయిన్ గా నాగచైతన్య, సమంత కలిసి జంటగా ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరి ఇరువురి వద్ద ప్రేమ చిగురించింది.
ఆ తరువాత ఇద్దరు కలిసి మనం, ఆటోనగర్ సూర్యలో జంటగా నటించారు. వీరిద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. పెళ్ళయాక చై,సామ్ కలిసి మజిలీ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. మంచి కథ దొరికితే కలిసి నటిస్తానని చైతు, సమంత ప్రకటించారు.
జ్యోతిక, సూర్య
పెళ్లికి ముందు సూర్య జ్యోతిక కలిసి ఏడు చిత్రాల్లో నటించారు. 2006లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జ్యోతిక సినిమాలకు దూరంగా ఉంది. జ్యోతిక
లేడి ఓరియెంటెడ్ చిత్రాలతోనే 2015 లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జ్యోతిక సూర్య కలిసి ఒక్క చిత్రం కూడా నటించలేదు. మంచి కథలు దొరకటం లేదని, దొరికితే ఇద్దరం కలిసి ఒకే సినిమాలో నటిస్తామని ఓ చిత్రం విడుదల సందర్భంగా సూర్య తెలిపారు.
దీపికా పదుకొనే, రణవీర్ సింగ్
రణవీర్ సింగ్, దీపికా పదుకొనే బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ కపుల్. తొలిసారి వీరిద్దరూ ‘గోలియోంకి రాస్ లీల – రామ్ లీల’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సంజయ్ లీల బన్సాలీ, బాజీరావ్ మస్తానీ, పద్మావతి చిత్రాల్లో కలిసి నటించారు. 2018లో దీపికా, రణ్వీర్ పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’83’ చిత్రంలో కపిల్ దేవ్ గా రణవీర్, భార్య రోమి గా దీపికా నటిస్తున్నారు.