Kamal Haasan-Nithiin: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ సరైన హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఈయన నుంచి చివరిగా వచ్చిన చెక్, రంగ్ దే చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫయం అయ్యాయి. అయితే ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్న నితిన్.. ఎమ్ఎస్. రాజశేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో `మాచర్ల నియోజవర్గం` సినిమా చేశాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాచర్ల నియోజకవర్గంలోని గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఆయన సరసన కృతిశెట్టి, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. అందులో భాగంగానే నేడు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను బయటకు వదలబోతున్నారు. అయితే ఈ సాంగ్ లోకనాయకుడు కమల్ హాసన్ చేతుల మీదగా బయటకు రాబోతుండటం విశేషం.
కమల్ హాసన్ తాజా చిత్రం `విక్రమ్`. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ చేత `మాచర్ల నియోజవర్గం` ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయించబోతున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ను సైతం బయటకు వదిలారు. ఏదేమైనా కమల్ చేతులగా ఫస్ట్ సింగిల్ విడుదలైతే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అంటే కమల్ ఒక రకంగా నితిన్‌కు సాయం చేసిపట్టే అవుతుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!