Kamal Hassan: విలక్షన నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి సినిమా ప్రేక్షకులను అలరించిన నటుడు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా భారతీయ చలన చిత్ర రంగంలో నటుడిగా రాణించిన కమలహాసన్ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. నటనలో కమలహాసన్ నీ మించిన నటులు లేరని చెప్పవచ్చు. పాపులారిటీ పరంగా కమల్ కంటే టాప్ హీరోలు ఉన్నాయి స్క్రీన్ మీద నటన విశ్వరూపం చూపించాలి అంటే కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా. ఇటువంటి కమల్ హాసన్ కెరియర్ ప్రారంభంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట.
ఈ విషయాన్ని ఇటీవల ఆయన స్వయంగా తెలియజేశారు. విషయంలోకి వెళ్తే విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యపై తమిళ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది. అది లేత వయసులో అంత ఒత్తిడికి పిల్లలు గురి కాకూడదని సూచించింది. ఈ సందర్భంగా కాలేజీ స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అయిన లోక నాయకుడు కమలహాసన్ తన 20 ఏళ్ల వయసులో కూడా తన ఆలోచన విధానం ఎంత మూర్ఖంగా ఉండేదో తెలియజేశారు. చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్న నన్నెవరూ గుర్తించట్లేదని బాధపడ్డాను. నేను చనిపోతే తన గొప్పదనం గురించి తెలుస్తుందని భావించా. ఈ విషయాన్ని నా మెంటర్ తో పంచుకున్న.
దీంతో ఆయన నువ్వు జీనియస్ అయితే మరి నేనేంటి అని ప్రశ్నించాడు. పట్టుదలతో పని చేస్తూ కోరుకునే గొప్ప క్షణాలు కోసం వేచి చూడాలని సూచించాడు. నేను మరణాన్ని జీవితంలో ఒక పార్ట్ గా భావించ. డెత్ వేరు వేరు కాదు. ఎండ్ లేస్ లైఫ్ కి పర్పస్… మీనింగ్ రెండు లేవు. కచ్చితంగా మనిషి జీవితంలో మరణం వస్తుంది దానికోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు అని కాలేజీ విద్యార్థులకు కమల్ హాసన్ ఈ సందర్భంగా వివరించారు.