నెక్స్ట్ రజనీకాంత్ డైరెక్టర్ తో కమల్ హాసన్..??

Share

దాదాపు చాలా సంవత్సరాల తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ “విక్రమ్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. లోకేష్ కనకగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఏకంగా తమిళనాడు ఇండస్ట్రీలో “బాహుబలి” రికార్డులను “విక్రమ్” బ్రేక్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇదే సమయంలో ఒకపక్క సినిమా కెరియర్ పరంగా ఇంకా రాజకీయపరంగా అనేక ఓటములు చూసిన కమల్.. తన రేంజ్ కి తగ్గ హిట్టు పడటంతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.

మరో పక్కన నాలుగు సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ సినిమా ధియేటర్ లో విడుదల అవటం తో పాటు ఇండస్ట్రీ హిట్ కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకున్నారు. యాక్షన్ త్రిల్లర్ నేపథ్యంలో తర్కెక్కిన ఈ సినిమా.. కోలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 450 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించడం విశేషం. విక్రమ్ సినిమాతో మంచి జోరు మీద ఉన్న కమల్.. నెక్స్ట్ కేరళ డైరెక్టర్ మహేష్ నారాయణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. ఆ తర్వాత “ఇండియన్ 2” సినిమా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. RC15 కంప్లీట్ అయిన వెంటనే శంకర్ “ఇండియన్ 2” బ్యాలెన్స్ కంప్లీట్ చేయనున్నారు.

ఇక ఇదే సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో “కబాలి” వంటి సినిమా తర్కెక్కించిన డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో కూడా కమల్ హాసన్ సినిమా చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రంజిత్ విక్రమ్ హీరోగా సినిమా చేస్తున్నారు. విక్రమ్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే కమలహాసన్ తో రంజిత్ సినిమా చేయనున్నట్లు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాక్.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

25 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

34 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago