Kamal Hassan: సినిమారంగంలో వినూత్న పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో కమల్ హాసన్. విలక్షణ నటుడిగా భారతీయ చలన చిత్ర రంగంలో మంచి పేరు సంపాదించిన కమల్.. కెరీర్లో అనేక లెజెండ్ క్యారెక్టర్లు.. వేయడం జరిగింది. నటన పరంగా కమల్ తిరుగులేని క్రేజ్ ప్రేక్షకులలో దక్కించుకున్నారు. ఇదిలావుంటే ఇటీవల లోకేష్ కనగరజ్ దర్శకత్వంలో కమలహాసన్ “విక్రమ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ జులాయి 16వ తారీకు రిలీజ్ కావడం జరిగింది.
ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి ఎంతో టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ ముగ్గురు హీరోలను హైలెట్ చేస్తూ సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి రిలీజ్ పోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రజలంటే ఈ సినిమాలో కమలహాసన్ అంధుడు పాత్ర చేస్తున్నారట.
Read More: Kamal haasan: కమల్ హాసన్ అభిమానులకు గుడ్ న్యూస్..!!
తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావటం జరిగింది. గతంలో 1981 వ సంవత్సరంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమలహాసన్ మొట్టమొదటిసారిగా “రాజా పార్వై” అనే సినిమా చేయడం జరిగింది. మరోసారి కెరీర్లో విక్రమ్ సినిమాలో కమల్ అందుడు పాత్ర వేయడం సంచలనంగా మారింది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విక్రమ్ సినిమాకి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. గిరీష్ గంగాధరం సినిమాటోగ్రఫీని, ఎడిటర్ గా ఫిలోమిన్ రాజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.