భ‌య‌పెట్టేది అప్పుడేన‌ట‌


కొరియోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడిగా మారిన రాఘ‌వ లారెన్స్‌.. మాస్‌, డాన్, రెబెల్ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలను డైరెక్ట్ చేసినా.. ముని, కాంచ‌న‌, గంగ వంటి హార‌ర్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న మార్కును క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఈ హార‌ర్ సినిమా ఫ్రాంచైజీలో కాంచ‌న 3 విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. రాఘ‌వేంద్ర‌ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లారెన్స్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో బి.మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు. వేదిక‌, ఓవియా, కోవై స‌ర‌ళ‌, క‌బీర్ సింగ్‌, స‌త్య‌రాజ్‌, శ్రీమాన్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 1న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ హార‌ర్ ఫ్రాంచైజీ చిత్రాలు ఘ‌న విజ‌యాలు సాధించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.