ప్రేమ‌లో ఉన్నా


క్వీన్, త‌ను వెడ్స్ మ‌ను చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కంగ‌నా ర‌నౌత్‌.. `మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా కూడా త‌నేంటో ప్రూవ్ చేసుకుంది. ఎప్పుడూ వివాదాల‌తో, సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలిచే కంగనా.. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాన్ని వెల్ల‌డించింది. అదేంటంటే కంగ‌నా ప్రేమ‌లో ఉంద‌ట‌. త‌న జ‌ర్నీలో ప్రేమ‌కు సంబంధించి చాలా చేదు విష‌యాలు ఎదురయ్యాయ‌ని, వాటికి భ‌య‌ప‌డ్డాన‌ని కూడా చెప్పిన కంగనా, ప్ర‌స్తుతం త‌న జీవితంలో ఒక వ్య‌క్తి ఉన్నాడ‌ని చెప్పింది. అంతే కాక‌.. త‌న‌కు స్ఫూర్తిగా నిలిచే వ్య‌క్తే త‌న‌కు తోడుగా ఉండాల‌నుకుంటున్నాన‌ని కూడా చెప్పింది. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నేది మాత్రం కంగ‌నా చెప్ప‌లేదు.