Mahesh Babu: “చంద్రముఖి 2” ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగానాలో హైదరాబాదులో సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీతో తన అనుబంధం గురించి ఇంకా అనేక విషయాలు గురించి మీడియాతో పంచుకుంది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన “ఏక్ నిరంజన్” సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు కంగనా పరిచయమయ్యింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. యధావిధిగా మళ్లీ కంగన హిందీ సినిమాలు చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే “ఏక్ నిరంజన్” సినిమాకి ముందు మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ తీసిన “పోకిరి” సినిమాలో హీరోయిన్ అవకాశం మొదట తనకే వచ్చినట్లు తాజాగా కంగనా కొత్త విషయాన్ని చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో తాను ఒప్పుకోలేదని.. మహేష్ బాబుతో ఆ సినిమా చేసుంటే.. ప్రజెంట్ సౌత్ లో తనకంటూ ఒక ఇమేజ్ వచ్చి ఉండేది. మహేష్ బాబుతో సినిమా చేయకుండా తప్పు చేశాను. “పోకిరి” సినిమా చేయాల్సింది.. అనవసరంగా వదులుకొని ఆ సినిమా విజయం తర్వాత చాలా బాధపడ్డానంటూ కంగనా చెప్పుకొచ్చింది. “పోకిరి” సినిమా అవకాశం వచ్చినప్పుడే “గ్యాంగ్ స్టార్” సినిమా అవకాశం కూడా రావడంతో.. డేట్స్ సర్దుబాటు చేయలేక.. “పోకిరి” ని వదులుకున్నట్లు ఇప్పుడు ఎంతగానో బాధపడుతున్నట్లు కంగనా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.
మళ్లీ తెలుగులో అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయడానికి రెడీగా ఉన్నట్లు.. “చంద్రముఖి 2” ప్రమోషన్ కార్యక్రమాలలో కంగనా స్పష్టం చేయడం జరిగింది. అంతేకాదు మరోసారి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని కూడా తెలిపింది. 25వ సంవత్సరంలో మీ వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. మళ్లీ 18 సంవత్సరాల తర్వాత సినిమాకి సీక్వెల్ గా వస్తున్న “చంద్రముఖి 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ స్థానంలో లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చంద్రముఖి పాత్రలో కంగనా కనిపిస్తోంది.