Rajamouli: బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తొలిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది.
ఈ చిత్రంపై సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్.. రాజమౌళి సాధించిన విజయాలు గొప్ప కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఆర్ఆఆర్ఆర్ సినిమాను చూసిన ఆమె.. సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టింది.
`ఎస్ఎస్ రాజమౌళి సార్ భారతీయ చలనచిత్ర దర్శకుడని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ ఆయన ఒక్క ఫ్లాప్ సినిమా కూడా తీయలేదు` అంటూ ఓ పోస్ట్‌లో రాసుకొచ్చిన కంగనా.. `రాజమౌళి గారు ఇప్పటి వరకు సాధించిన విజయాలు గొప్ప కాదు.. ఆయనలో ఉన్న సింప్లిసిటీనే అన్నిటికంటే గొప్పది.
దేశంపై ఆయనకు ఉన్న గౌరవం, ధర్మంపై ఆయనకు ఉన్న ప్రేమ అద్భుతం. మీలాంటి రోల్ మోడల్ ఉండడం మా అదృష్టం.. నిజాయితీగా నేను మీ అభిమానిని` అంటూ మరో పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఎప్పుడూ వివాస్పద వ్యాఖ్యలతో వివాదాల చుట్టు తిరిగే కంగనా.. ఈసారి రాజమౌళిపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టడం విశేషం.