బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తన చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ” బాల్యంలో తోటి పిల్లలతో కలిసి ఎలా అనుకున్నాను గుర్తులేదు కానీ.. నేను ఆడుకునే బొమ్మలకు మాత్రం మంచి ఫ్యాన్సీ దుస్తులను కుట్టేదాన్ని.. బొమ్మలకి దుస్తులు కుట్టడం కోసం గంటల కొద్ది సమయాన్ని వెచ్చించేదాన్ని.. ఇప్పుడు ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించాల్సి వస్తుందంటే దీని వల్లనేమో.. అయితే మనలోని కొందరు పుట్టుకతోనే వృద్దులుగా ఉంటున్నారు వారిలో నేను కూడా ఉండొచ్చు” అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన చిన్నతనంలో ప్యాషన్‌పై ఎక్కువగా మక్కువ ఉండేదని.. ఆ ఇష్టమే లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేంత వరకు తీసుకెళ్ళింది అన్నారు.
ఫ్యాషన్ దుస్తులు ధరించినప్పుడు ఎత్తు చెప్పులు వేసుకుని అప్పుడు చుట్టుపక్కల వాళ్లు చూసి నవ్వుకునేవారు ఎగతాళి కూడా చేసేవారు వాటినన్నిటిని తట్టుకొని ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. కంగనా కాంట్రవర్సీ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఈ బాలీవుడ్ తార బిజీగా ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం,కంగనా మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ తరుణంలో ముంబై బంద్రాలోని కంగనా కార్యాలయాన్ని బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కూల్చివేసింది. అయితే రాజకీయంగా పెను దూమారాన్ని రేపింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం వల్లే ఆమె ఆఫీస్‌ను కూల్చేశారని పలువురు విమర్శలు చేశారు. ఈ తరుణంలో సహచార తారలు విపక్షాలు.. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం విరుచుకుపడ్డారు.
https://twitter.com/KanganaTeam/status/1335800235889623040?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1335800235889623040%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.pinkvilla.com%2Fentertainment%2Fnews%2Fkangana-ranaut-gets-nostalgic-reveals-she-never-played-kids-some-us-are-born-old-i-am-one-those-580659
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!