సినిమా

Kangana Ranaut: అందుకే నాకింకా పెళ్లి కావ‌డం లేదు.. కంగ‌నా ఆవేద‌న‌!

Share

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా బాలీవుడ్‌లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో ఒక‌రిగా స్థానం సంపాదించుకుందంటే కంగ‌నా టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగులోనూ ఈమె న‌టించింది.

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఏక్ నిరంజ‌న్‌` మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా కంగ‌నా న‌టించింది. 2009 లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఆ త‌ర్వాత కంగ‌నా మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. బాలీవుడ్‌లోనే న‌ట‌నా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ అక్క‌డ స్థిర‌ప‌డిపోయింది.

Kangana Ranaut changed her route

న‌ట‌న ప‌రంగానే కాదు కంట్ర‌వ‌ర్సీల‌తోనూ సూప‌ర్ పాపుల‌ర్ అయిన కంగ‌నా.. 35 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె త‌నకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదో వివ‌రిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అసలేం జ‌రిగిందంటే.. కంగ‌నా న‌టించిన తాజా చిత్రం `ధాకడ్‌` మ‌రి కొద్ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇందులో ఏజెంట్‌ అగ్ని అనే గూడఛారి పాత్రలో కంగ‌నా క‌నిపించ‌బోతోంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. అక్క‌డ `నిజ జీవితంలోనూ టామ్ బోయ్ మాదిరిగానే ఉంటారా?` అని యాంక‌ర్ ప్ర‌శ్నించారు. అందుకు కంగ‌నా..`నేను అలా ఉండను. నిజ జీవితంలో నేను ఎవరిని కొట్టాను? చూపించండి. మీ లాంటి వ్యక్తులు ఈ తరహా పుకార్లను వ్యాప్తి చేయడం వల్లే నాకింకా పెళ్లి కావ‌డం లేదు. నేను ఊరికే అందరితో గొడవ పడతానేమో అని జనాలు అనుకుంటున్నారు` అని ఆమె బదులిచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Related posts

Jathi ratnalu : జాతిరత్నాలు టీమ్ ను కలవాలని ఉందా.. అయితే ఇలా చేయండి.. ఫ్రీ పాస్ ఇస్తారు..!!

bharani jella

చిరు టూర్ వెనుక సీక్రెట్ అదేనా?

Siva Prasad

డేట్ లాక్ చేశారు సరే ..పెద్ద సినిమాలొస్తే పరిస్థితేంటి ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar