తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి పలువురు దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. అందులో ఒకటి వెబ్‌సిరీస్. సినిమాల విషయానికి వస్తే కంగనారనౌత్ జయలలితగా నటిస్తున్న సినిమా `తలైవి`. ప్రస్తుతం ఈ సినిమా వర్క్ షాప్ జరుగుతోంది. అందులో భాగంగా కంగనా రనౌత్ తమిళం నేర్చుకోవడంతో పాటు నాట్యం నేర్చుకుంటోంది. బరువు కూడా పెరుగుతున్నారు. ఈ సినిమాలో జయలలిత జీవితాన్ని నాలుగు దశల్లో చూపించబోతున్నారట. అందుకోసం కంగనా నాలుగు షేడ్స్‌లో కనపడబోతున్నారట. ఈ దీపావళికి సినిమాను సైట్స్ పైకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారట.
previous post