ట్రెండింగ్ సినిమా

Kangana Ranaut: బాలీవుడ్ కి షాక్ ఇచ్చిన కంగనారనౌత్.. మహేష్ బాబుకి సపోర్ట్..!!

Share

Kangana Ranaut: మహేష్ నిర్మాణ సారథ్యంలో అడివి శేష్ హీరోగా నటించిన “మేజర్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో మహేష్ ఇటీవల పాల్గొనడం తెలిసిందే. ఆ సమయంలో మీడియా లేఖరులు వేసిన పలు ప్రశ్నలకు అనేక సమాధానాలు మహేష్ ఇవ్వడం జరిగింది. కాగా బాలీవుడ్ ఎంట్రీ గురుంచి వేసిన ప్రశ్నకు మహేష్ సమాధానం ఇస్తూ…బాలీవుడ్ నన్ను భరించలేదు అని వైరల్ కామెంట్స్ చేశారు. పైగా..హిందీలో నేను నా టైం వేస్ట్ చేసుకోను. తెలుగులో నాకు చాలా కంఫర్ట్ ఉంది అని సమాధానమిచ్చారు. దీంతో బాలీవుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా గత కొద్దీ రోజుల నుండి  మహేష్ కామెంట్లను చాలా నెగిటివ్ గా కథనాలు ప్రసారం చేస్తూ ఉంది. ఈ క్రమంలో మహేష్ కామెంట్లపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Kangana Ranaut supports Mahesh Babu bollywood comments

అయితే వివాదం పెరుగుతూ ఉండటంతో వెంటనే మహేష్ వివరణ ఇస్తూ.. మన తెలుగు సినిమాలు అన్ని చోట్లకు వెళుతున్నాయి. తెలుగు సినిమా నే బాలీవుడ్ కి రీచ్ అయ్యింది. నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్. అది బాలీవుడ్ లో కూడా విడుదల అవుతుంది. అన్ని భాషల మీద గౌరవం ఉంది. బాలీవుడ్ నీ తక్కువచేసి మాట్లాడలేదు అన్నట్టు మహేష్ వివరణ ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మహేష్ కామెంట్లపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ రియాక్ట్ అయ్యారు.

 

తాను నటించిన “థాకాడ్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ విలేఖరి మహేష్ బాలీవుడ్ పై చేసిన కామెంట్లపై మీ రియాక్షన్ ఏంటి అని అడిగారు. దానికి కంగనారనౌత్ సమాధానమిస్తూ…” మహేష్ చెప్పింది ముమ్మాటికీ సత్యమే. అతడు చేసిన కామెంట్లతో నేను ఏకీభవిస్తాను. మహేష్ కి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుండి ఆఫర్లు వచ్చాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు దర్శకులు..వాళ్ల ఇండస్ట్రీని ఇండియాలోనే నెంబర్ వన్.. ఇండస్ట్రీగా తీర్చిదిద్దేలా చేశారు. కాబట్టి బాలీవుడ్ అతనిని నిజంగానే భరించలేదు. మహేష్ కామెంట్లు చూస్తే అతడు తన పరిశ్రమ పట్ల గౌరవం చూపించాడు. అందులో తప్పేమీ లేదు. పైగా గతంలో మన బాలీవుడ్ కి చెందినవాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమని చాలా చిన్నచూపు చూశారు. ఇదంతా మనకందరికీ తెలిసిందే. వాళ్లు ఎంతో కష్టపడ్డారు.. ఇప్పుడు ఎంతో ఎదిగారు. వాళ్ల నుంచి మనం.. చాలా నేర్చుకోవాలి. అదే రీతిలో తమిళ్ ఇండస్ట్రీ ద్వారా కూడా అనేక విషయాలు నేర్చుకోవాలి. నేను బలంగా నమ్ముతాను దేశంలో అన్ని భాషలను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలి అంటూ కంగనారనౌత్ మహేష్ కి మద్దతుగా కామెంట్లు చేయడం జరిగింది. దీంతో బాలీవుడ్ మీడియాకి కంగనా కామెంట్లు షాక్ ఇచ్చినట్లు అయింది.


Share

Related posts

మహేష్ బాబు ఇక నుంచి అలాంటి సినిమాలు చేస్తే ఫ్యాన్స్ చూడమంటున్నారు ..?

GRK

సినీ అభిమానులు నరాలు ఎదురుచూసే రోజు..! కేజీఎఫ్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

Vissu

Job Notification: నిరుద్యోగులకు శుభవార్త..!! పవర్ గ్రిడ్ లో 1110 ఖాళీలు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar