విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం ఒకపక్క, వీరనారి ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఘన చరిత్ర ఒక పక్క. ఈ రెండింటిలో ఒకటి కథగా మర్చి సినిమా చేయాల్సి వస్తే, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎన్టీఆర్ కథవైపే కదిలాడు. అప్పటికే దాదాపు 75% శాతం చిత్రీకరణ పూర్తి చేసిన మణికర్ణిక సినిమాని కూడా వదిలి క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించడానికి వచ్చాడు. క్రిష్ రాక, బాలయ్యతో కలయిక అన్నీ ఎన్టీఆర్ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని కలిగించాయి. ఈ సమయంలో నాయకుడు లేని నావలా మణికర్ణిక ఆగిపోతుందనుకున్నారు. అయితే క్రిష్ లేని లోటుని తీరుస్తూ లీడ్ రోల్ ప్లే చేసిన కంగనానే మాణికర్ణికని ముందుండి నడిపించింది.
మణికర్ణిక సినిమా నుంచి బయటకి వచ్చిన క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 కథానాయకుడు సినిమా నష్టాల్లో ఉంది, ఎవరు ఏం చేసినా కథానాయకుడు సినిమాని కాపాడే వారే కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో మణికర్ణిక సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఏ డైరెక్టర్ అయితే తన సినిమాని మధ్యలో వదిలి వెళ్లిపోయాడో అదే దర్శకుడి ముందు హిట్ కొట్టి చూపించాలనే కసితో కంగనా ఉంది. కంగనా తను అనుకున్నది సాధిస్తుందో లేదో తెలియదు కానీ క్రిష్ డైరెక్ట్ చేసిన కథానాయకుడు సినిమా ఎలాగూ పోయింది, అతను వదిలి వచ్చేసిన మణికర్ణిక హిట్ అయితే మాత్రం ఒక ఫ్లాప్ సినిమా కోసం క్రిష్ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు అనే అపవాదు మాత్రం జీవితాంతం మోస్తాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!