బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పై కంగనా రనౌత్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. “లాల్ సింగ్ చడ్డా” పై వ్యతిరేక ప్రచారం వెనకాల హీరో అమీర్ ఖాన్ హస్తం ఉందని ఆరోపించింది. ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నాడని విమర్శలు చేసింది. ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క హిందీ సినిమా విజయం సాధించలేదు. దక్షిణాది సినిమాలే భారతీయ సాంప్రదాయాన్ని ప్రతి బింబించేలా సినిమాలు తెరకెక్కించి విజయాలు సాధించారు. ఆమిర్ జీ హిందీ ఫోబిక్ పికే తీసినా, ఇండియాలో అసహనం ఎక్కువైందని అన్నప్పటికీ ఆయన సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు దీనిని మతం అంశంగా చిత్రీకరించడం ఆపండి అంటూ కంగనా రనౌత్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
“లాల్ సింగ్ చడ్డా” హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన “ఫారెస్ట్ గంప్” కి రీమేక్ గా తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11 వ తారీకు విడుదల కానుంది. అమీర్ ఖాన్ పక్కన హీరోయిన్ గా కరీనాకపూర్ నటించింది. అయితే ఇటీవల ఈ సినిమాకి బాయ్ కట్ సెగ తగిలింది. సోషల్ మీడియాలో “లాల్ సింగ్ చడ్డా” బాయికాట్ చేయాలంటూ పలువురు నెటిజెన్ లు తెగ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ప్రచారంపై అమీర్ ఖాన్ గతంలో రియాక్ట్ అయ్యారు. తన సినిమాని ఎవరు బహిష్కరించవద్దని కోరాడు. ” నాపై, నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనసులో గట్టిగా నాటుకుపోయింది.
అందుకు నాకు చాలా విచారంగా ఉంది. నేను నా దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు నేను చెప్పాల్సింది ఒకటే. మీరు నాపై పెట్టుకున్న ఈ అభిప్రాయం ఎంత గట్టిగా నమ్ముతున్న వాటిలో వాస్తవం లేదని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. నా గురించి అలాంటి ప్రచారాలు జరగడం చాలా బాధాకరంగా ఉందని దయచేసి “లాల్ సింగ్ చడ్డా” బాయ్ కాట్ చేయొద్దు అంటూ అమీర్ ఖాన్ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా అమీర్ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పై విధంగా రియాక్ట్ కావడం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.