నటిగా తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకున్న కంగనా రనౌత్ దర్శకురాలిగా కూడా `మణికర్ణిక`తో విజయాన్ని తన ఖాతాలో వేసేసుకున్నారు. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా మాట్లాడే కంగనా రనౌత్ జాతీయ అవార్డుల గురించి మాట్లాడింది. తనకు కూడా జాతీయ అవార్డు రావాలంది. తనకు కానీ జాతీయ అవార్డు ఇవ్వకపోతే జాతీయ అవార్డ్ కమిటీపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు కంగనా. ముంబైలో మీడియాలో మాట్లాడుతూ “ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. లేకపోతే సంస్థపై అనుమానాలు రాకతప్పదు. ఒకవేళ నాకంటే మరెవరైనా బాగా నటించి ఉండి వారికి అవార్డ్ వస్తే వారితో నేను ఏకీభవిస్తాను. నాకు తెలిసినంత వరకు మణికర్ణికను మించి మరో సినిమా రాకపోవచ్చు. టబు అంధాదున్ చిత్రంలో చాలా బాగా నటించారు“ అన్నారు.
అంతే తనకు అవార్డు ఇవ్వకుంటే విమర్శలన ఎదుర్కోవాల్సి ఉంటుందని కంగనా జాతీయ అవార్డు కమిటీకి హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పుడు నిజంగానే కంగనాకు ఫిలిం ఫేర్ అవార్డ్ వస్తుందా? రాదా? .. వేచి చూద్దాం.