విజయవంతమైన చిత్రాలతోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తోన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అంటే వెంటనే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ఈమె ‘పంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలా టఫ్‌గా కనిపించే కంగనా.. తన సాఫ్ట్ సైడ్‌ను కూడా రివీల్ చేసింది. తాను పెళ్లికి సిద్ధమంటూ బాలీవుడ్ మీడియా దగ్గర ప్రకటించింది. అయితే నా ఆలోచనా ధోరణికి సరిపోయే వాడి కోసం వేచి చూస్తున్నాను. నా ప్రస్తుత చిత్రం ‘పంగా’ డైరెక్టర్ అశ్విని నాయర్ భర్త నితేష్ తివారిని చూసిన తర్వాత పెళ్లిపై నా అభిప్రాయం మారిందని కంగనా తెలిపింది. అంటే కంగనా వ్యవహారం చూస్తుంటే ఆమె కంటే తెలివైనవాడు, అందగాడి కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లే. మరి అలాంటి వాడు ఎప్పుడు ఆమెకు దొరుకుతాడో వేచి చూడాలి.
previous post
next post