ఝాన్సీ రాణి వీరచరిత్ర ప్రపంచానికి చూపించడానికి క్రిష్ మొదలుపెట్టిన మహాకావ్యం మణికర్ణిక, మొదలుపెట్టిన క్రిష్ మధ్యలోనే వదిలేసినా టైటిల్ రోల్ ప్లే చేసిన కంగనా మాణికర్ణికని పూర్తి చేసింది. ఇప్పటివరకూ ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి మణికర్ణికతో మొదటిసారి డైరెక్టర్ గా మారిన కంగనా ఎంత వరకూ మెప్పించిందో చూద్దాం.
కథ :
ఇండిపెండెన్స్ కోసం తెల్లదొరలపై పోరాటం చేసి, చివరి రక్తపు బొట్టు వరకు రవి అస్తమించని బ్రిటిష్ సైన్యానికి కూడా వెన్నులో వణుకు పుట్టించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ కథ మనం చిన్నప్పటి నుంచీ వింటున్నదే, ఇప్పుడు ఇదే కథని తెరపై చూపించడానికి వచ్చిన సినిమా మణికర్ణిక. కథాకథనాల పరంగా చూసుకుంటే బితూర్‌లో పుట్టిన మణికర్ణిక (కంగనా రనౌత్) ఝాన్సీ రాజు గంగాధర్ రావు(జిషు సేన్‌గుప్తా) ను వివాహం చేసుకోవడంతో మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మారుతుంది. భర్త మరణించటంతో రాజ్యాధికారాన్ని తీసుకున్న లక్ష్మీబాయికి బ్రిటీషర్ల నుంచి వచ్చిన ఇబ్బందులు ఏంటి? వాటిని తను ఎలా ఎదురించి పోరాడింది? అన్నదే ఈ సినిమా కథ
నటీనటులు :
లీడ్ రోల్ ప్లే చేసిన కంగనా, సినిమాని అంతా తానే అయి నడిపించింది. మణికర్ణిక నుంచి వీరనారిగా ఆమె జీవిత ప్రయాణం సాగిన తీరుని తెరపై చూపించే క్రమంలో కంగనా యాక్టింగ్ అద్భుతంగా సాగింది. వన్ మ్యాన్ షో అనే పదం విన్నాం కానీ మణికర్ణిక సినిమా చూస్తే ఇది వన్ విమెన్ షో అని తప్పక అంటారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో కంగనా పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ గా ఉంది. ఇక కీలక పాత్రల్లో నటించిన అతుల్ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, డానీ డెంజొప్ప, అంకితా లోఖండే బ్రిటీష్ పాలకుడిగా రిచర్డ్ కీప్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
విశ్లేషణ :
మంచి హుక్ పాయింట్ తో, ఇంట్రెస్టింగ్ గా మొదలైన మణికర్ణిక సినిమా ఆ తర్వాత అంతా కంగనాని ఎలివేట్ చేయడానికే టైమ్ తీసుకుంది. ఝాన్సీ రాణి గొప్పదనం చూపించడం కోసం సన్నివేశాలు రాసుకున్నారు అనే స్థాయిలో ఫస్ట్ హాఫ్ సాగింది. భర్త మరణంతో లక్ష్మీ బాయి రాజ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంలో వేగం కనిపిస్తుంది. ఇక సినిమా మంచి ఫ్లోలో వెళ్లిపోతుందిలే అనుకుంటున్న టైమ్ కి పాటలు వచ్చి ఎక్కడ లేని చిరాకు తెప్పిస్తాయి. లెంగ్తీ సీన్స్ ఆడియన్స్ సహనాన్ని పరిక్షిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగా డిజైన్ చేశారు కానీ చాలా వరకూ రిపీటెడ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ సూపర్బ్ అనిపిస్తుంది, చివరి 20 నిమిషాల్లో కంగనా చూపించిన నటన చాలా కాలం పాటు గుర్తుండి పోతుంది. మ్యూజిక్ పూర్తిగా నిరాశపరిచినా కూడా సినిమాటోగ్రఫి బాగుంది, ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి కంగనా ముందుండి నడిపించిన ఈ మణికర్ణిక సినిమా ఆశించిన స్థాయిలో లేదు కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ మాత్రం సెట్ చేసింది.
ప్లస్ పాయింట్స్ :
కంగనా రనౌత్
పోరాట సన్నివేశాలు
ఎమోషనల్ సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
సంగీతం