NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Babu: మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేత్తినా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్..!!

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఓపెనింగ్ రాబట్టే హీరోలలో మొదటి వరుసలో మహేష్ ఉంటారు. జయపజయాలతో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలకు రికార్డు స్థాయి కలెక్షన్స్ వస్తుంటాయి. మహేష్ కెరియర్ లో ఒక్కడు, మురారి, పోకిరి, అతడు, దూకుడు, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరు అనేక సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద రాబట్టాయి. మహేష్ బాబు సినిమాలకు తెలుగులోనే కాదు దక్షిణాదిలో అనేక రాష్ట్రాలలో కూడా మార్కెట్ ఉంది. ఈ క్రమంలో మహేష్ సినిమాలను చాలామంది ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోలు రీమేక్ చేసి హిట్లు కూడా కొడుతూ ఉంటారు.

Kannada star hero Shivraj Kumar showered praises on Mahesh Babu

ఇదిలా ఉంటే తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్.. సూపర్ స్టార్ మహేష్ బాబు పై పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగు హీరోలకు సంబంధించి సోషల్ మీడియాలో చర్చ చేసిన శివరాజ్ కుమార్.. మహేష్ బాబు ప్రస్తావన వచ్చినప్పుడు పొగడ్తల వర్షం కురిపించారు. మహేష్ ఎక్స్ట్రీమ్లీ డిగ్నిఫైడ్ అండ్ ప్రొఫెషనల్ నటుడు. మహేష్ చాలా తక్కువగా మాట్లాడుతాడు. అటువంటి సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ నీ చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. కానీ స్క్రీన్ మీద ఎలక్ట్రిఫైంగ్ పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోతుంటాడు. ఆయనను ప్రేమించే అభిమానులకు ఆయనకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు శివరాజ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Kannada star hero Shivraj Kumar showered praises on Mahesh Babu

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమా అయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నట్లు టాక్. మహేష్ కెరియర్ లో మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. RRR అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించటంతో.. రాజమౌళి గ్లోబల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు సినిమా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత అధికారికంగా మహేష్ ప్రాజెక్టు షూటింగ్ విశేషాలు మీడియా సమావేశం పెట్టి రాజమౌళి చెప్పబోతున్నట్లు సమాచారం.


Share

Related posts

My Name Is Sruthi: హన్సిక “మై నేమ్ ఇస్ శృతి” సినిమా పూజా కార్యక్రమం..!! షూటింగ్ ఎప్పుడంటే..!!

bharani jella

Kajal Aggarwal: దుబాయి దేశం నుండి అరుదైన గౌరవం అందుకున్న కాజల్ అగర్వాల్..!!

sekhar

లేటెస్ట్ టాక్‌.. చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` విడుద‌ల వాయిదా..?!

kavya N