ఇండియన్ క్రికెట్ లో 1983 సంవత్సరం మరపురానిది. ఆ ఏడాది కపిల్ నాయకత్వంలో ఇండియన్ క్రికెట్ టీం విశ్వ విజేతగా ఆవిర్భవించింది. అసలు ఎలాంటి అంచనాలు లేని భారత జట్టు సాధించిన ఈ అపూర్వ విజయాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు నిర్మాత విష్ణు ఇందూరి. కబీర్ ఖాన్ దర్శకుడు. `83` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా క్రికెట్ క్రీడకు సంబంధించింది కాబట్టి.. రణవీర్ నటీనటులందరూ హిమాచరల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో క్రికెట్ శిక్షణ తీసుకుంటున్నారు. `83` చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీల్ కపిల్ దేవ్ కోసం రియల్ కపిల్ దేవ్ స్వయంగా నెట్స్ లో శిక్షణ ఇవ్వడం విశేషం. కపిల్ శిక్షణ ఇస్తున్న ఫోటోలను రణవీర్ సింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కపిల్ దేవ్ ఆడే నటరాజ్ షాట్ వీడియో కూడా పోస్ట్ చేసి లెజెండ్ అని మెసేజ్ ను పోస్ట్ చేశాడు రణవీర్ సింగ్.
previous post
next post