కార్తీ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ’దొంగ’. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా కార్తీతో పాత్రికేయులతో మాట్లాడుతూ “నా ప్రతి సినిమాకు వందశాతం న్యాయం చేస్తూ వచ్చాను. ఇప్పటివరకు 19 సినిమాలు చేశాను. ప్రతిదీ నాకు నచ్చిన సినిమాలే చేస్తూ వచ్చాను. బాలీవుడ్ చిత్రం ‘రంగ్ దే బసంతి’ సినిమాకు వర్క్ చేసిన రైటర్ రెన్సిల్ డి.సిల్వ ఈ స్క్రిప్ట్‌ను నాదగ్గరకు తీసుకువచ్చారు. నెరేషన్లో అక్క క్యారెక్టర్ నాకు నచ్చింది. అప్పుడే వదినకు వినిపించాను ఆమెకు బాగా నచ్చింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నపుడు ’దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ అయితే ఈ కథకు పూర్తి న్యాయం చేయగలడు అనిపించి మా ప్రొడ్యూసర్స్ అతన్ని కాంటాక్ట్ అవడం జరిగింది. కార్తీ, జ్యోతిక ఇద్దరు చేస్తున్నారంటే నేను తప్పకుండా చేస్తాను అని ఓకే చేశారు. జీతూ జోసెఫ్ కి స్క్రిప్ట్ నచ్చగానే నాకు సినిమా మీద కాన్ఫిడెంట్ పెరిగింది. మా వదిన యాక్టింగ్ స్కిల్స్ గ్రేట్. పైగా ఆవిడది స్ట్రాంగ్ క్యారెక్టర్. తమిళ్ నేర్చుకొని పంచ్ డైలాగ్స్ చెప్పి ఇవి నీ సినిమాలో పెట్టుకో అనేవారు. అలాగే మా ఫాదర్ రోల్లో నటించిన సత్యరాజ్గారిది కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్. సినిమా గురించి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి అలాగే సస్పెన్స్ ఉంది. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఊపిరి సినిమాలో నేను చేసిన శీను క్యారెక్టర్లా ఉంటుంది. కేవలం దొంగతనం చేయడమే కాదు ఇతరుల మనసుల్ని దోచుకున్నా ’దొంగ’ టైటిల్ సరిపోతుంది. ఒక ’దొంగ’ మంచి గా మారి అందరి హృదయాల్ని ఎలా దోచుకున్నాడనే స్టోరీ కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ అనిపించింది. ‘ఖైదీ’ టైటిల్ చిరంజీవి గారిది అని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఆ సినిమాకు కూడా అది యాప్ట్ టైటిల్. ఈ సినిమాకోసం ’తమ్ముడు’ టైటిల్ అనుకున్నాం కానీ దొరకలేదు కాబట్టి కథానుగుణంగా ‘దొంగ’ టైటిల్‌ను పెట్టాం. ఇప్పుడు మళ్ళీ ’దొంగ’ కూడా చిరంజీవి గారి టైటిల్ కావడం నిజంగా సంతోషంగా అనిపించింది. తెలుగులో రావూరి వి.శ్రీనివాస్‌గారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!