Subscribe for notification
Categories: సినిమా

Karthika Deepam: మరొకరితో పెళ్ళికి ఒప్పుకున్న హిమ..!జీవితాంతం ఇలా బ్రాహ్మచారిగానే ఉంటాను అంటున్నా నిరూపమ్..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత వారం హిమ, నిరుపమ్, సౌర్యల జీవితాల్లోకి శోభ ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి మోనిత తెర మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగానే తెలుసుకుందామా.సౌందర్య, ఆనందరావులు హిమకు పెళ్లి చేయడానికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు.సరిగ్గా అప్పుడే హిమ రావడంతో మళ్ళీ ఒకసారి ఎందుకు నిరుపమ్‌తో పెళ్లి వద్దు’ అన్నావ్ అని నిలదిస్తారు.హిమ ఏమి మాట్లాడదు. దీనితో సౌందర్యకు కోపం వచ్చి నువ్వు ఎలాగో కారణం చెప్పవు. పెళ్లి దాకా వచ్చి క్యాన్సిల్ అయ్యిందన్న విషయం ఇప్పటికే చాలా మందికి తెలిసిపోయింది. ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది. కాదు నీకోసం మరో సంబంధం చూస్తాం.. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే’ అంటుంది సౌందర్య హిమతో కోపంగా.

karthika deepam latest episode

మరొకరితో పెళ్ళికి ఒప్పుకున్న హిమ :

ఇక హిమ మాత్రం మనసులో బావ మనసులోంచి నేను వెళ్లిపోవాలన్నా, బావకు నేను దూరం కావాలన్నా గాని నేను ఏవరినో ఒకరిని పెళ్లి చేసుకోక తప్పుదు అని మనసులో అనుకుంటూ ‘ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను నాన్నమ్మా’ అంటుంది. హిమ అన్నా మాటకు సౌందర్య, ఆనందరావులు ఒక్కసారిగా షాక్ అవుతారు.‘ఏంటే నువ్వు నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుని అంచనాలన్నీ తారుమారు చేస్తున్నావ్..మరి నిరుపమ్ ఏం అయిపోవాలి? అలా బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందేనా అంటుంది. ఒక పని చెయ్ ఎలాగో నువ్వు చేసుకోవ్ కదా కనీసం ఆ శోభను అయినా పెళ్లి చేసుకో అని ఒప్పించు.. వెళ్లు’ అని అరిచేసి అక్కడ నుంచి సౌందర్య వెళ్లిపోతుంది.

karthika deepam latest episode

స్వప్నకు చుక్కలు చూపిస్తున్న ఇంద్రుడు -చంద్రుడులు :

సీన్ కట్ చేస్తే ఇంద్రుడు, చంద్రమ్మల దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు కలిసి పార్క్ దగ్గర ఉంటారు. మళ్ళీ స్వప్నతో ఎలాగైనా ఒక ఆట ఆడుకోవాలని పార్క్ లో వాకింగ్ చేస్తున్న స్వప్న కారు తాళం రాకుండా చేసి మళ్ళీ ఆ కారును తిరిగి వాళ్లే బాగు చేస్తారు. అందుకు ప్రతిఫలంగా స్వప్న నుంచి పది వేలు తీసుకుని భలే మోసం చేసాం కదా అని సంతోషిస్తారు. ఇక నిరుపమ్ మాత్రం ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉండడం చూసి తండ్రి బాధని సత్య ఓ సలహా ఇస్తాడు. అసలు హిమా ఇలా ఎందుకు చేసిందో హిమనే అడుగరా లేదంటే జ్వాలతో అడిగించు అని సలహా ఇస్తాడు. సరేనంటాడు నిరుపమ్. వెంటనే సత్య జ్వాలకు కాల్ చేసి అమ్మా నిరుపమ్ ఇంటికి వచ్చాడు.. వచ్చేటప్పుడు లంచ్ కొంచెం ఎక్కువగా తీసుకునిరా అని జ్వాలకు చెబుతాడు సత్య.

karthika deepam latest episode

జ్వలను కలిసి సౌందర్య ఏమి మాట్లాడింది:

ఇక సత్య సార్ చెప్పగానే జ్వాల క్యారేజ్ తీసుకుని బయలుదేరుతుంది. మధ్యలో సౌందర్య ఎదురు పడుతుంది.జ్వాలతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఎందుకో ‘నాకు నిన్ను చూడాలని,నీతో మాట్లాడాలని తెగ అనిపిస్తుందే ఒకసారి నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్లవా’ అంటుంది ప్రేమగా. ఇక జ్వాల మాత్రం మనసులో ‘మనది రక్త సంబంధం కదా నాన్నమ్మా.. నీకు అలా అనిపించడంలో తప్పులేదులే’ అని అనుకుంటుంది మనసులో.ఇప్పుడు నేను నా మొగుడికి భోజనం తీసుకుని వెళ్తున్నా.. నిన్ను సాయంత్రం కలుస్తాను సీసీ. అప్పుడు ఇద్దరం కలిసి మా ఇంటికి వెళదాం అని అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోతుంది.

జ్వలను తిట్టిన ప్రేమ్.. కంటతడి పెట్టిన జ్వాల :

సీన్ కట్ చేస్తే నిరుపమ్, సత్యలు మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ్ వస్తాడు. ప్రేమ్ ముఖం. నీకేం అయ్యిందిరా ప్రేమ్ అంటూ నిరుపమ్ కదిలిస్తాడు. అదేం లేదురా నాకేం నేను బాగానే ఉన్నాను అంటూ సమాధానం ఇస్తాడు ప్రేమ్. ఇంతలో జ్వాల క్యారేజ్ తీసుకుని వస్తుంది. అక్కడ ముగ్గురు కూర్చోవడం చూసి ‘హేయ్ ఎక్స్‌ట్రా’ అంటూ కామెడీగా ఎప్పటిలానే ప్రేమ్ ను ఆటపట్టిస్తుంది. కానీ ప్రేమ్ మాత్రం కోపంతో ఒక రేంజ్ లో జ్వాల మీద రెచ్చిపోతాడు. ఎక్సట్రా ఏంటి…వచ్చావా..భోజనం తెచ్చమా? డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లు ఉండు.. ఎక్స్‌ట్రా.. గిగస్ట్రా అని ఏదన్నా వాగితే మాత్రం బాగోదు’ అంటూ ఆవేశంతో ఊగిపోతాడు.పాపం ప్రేమ్ ఒక్కసారిగా అలా అనడంతో జ్వాల చాలా బాధ పడుతుంది.డబ్బులు.. కేవలం డబ్బులు కోసమే నేను మీకు భోజనం తెస్తున్నానా’ అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి జ్వాలకు. ఇక ప్రేమ్ మాత్రం ‘హా అంతే కదా..లేకపోతే నువ్వేమైనా నా మేనత్త కూతురివా? మేనమామ కూతురివా?’ అని అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతాడు. నిరూపమ్, సత్య అడ్డుపడిన ప్రేమ్ మాత్రం తగ్గడు. హిమకు ప్రపోజ్ చేయడానికి చూసిన ప్రతిసారి ఈ జ్వాలే అడ్డుకుంది అని మనసులో తిట్టుకుంటూ వెళ్లిపోతాడు.

హిమ కాదంటే బ్రహ్మచారిలా ఉంటాను అంటున్న నిరూపమ్:

ఇక ప్రేమ్ వెళ్ళగానే సత్య, నిరుపమ్‌లు జ్వాలకు సారీ చెబుతారు. ‘ఫర్వాలేదు’ అంటూ ఓ వెర్రి నవ్వు నవ్వేసి అక్కడి నుంచి జ్వాల వెళ్లిపోతుంది. ఇక సత్యతో నిరుపమ్ ‘డాడీ మమ్మీ మళ్లీ నాకు పెళ్లి చేయాలనీ చూస్తుంది.అది జరగదని మమ్మీకి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. నాకు ఎవరైతే ఇష్టమో వాళ్తోనే నా పెళ్లి జరుగుతుంది కాదు కూడదు అంటే ఇలాగే జీవితాంతం బ్రహ్మచారిలా ఉండిపోతాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share
Ram

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

18 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

48 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago