Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో నిరుపమ్…హిమ మీద చాలా కోపంగా ఉంటాడు.కాసేపటికి నిరుపమ్ కారులో కూర్చుని అదే విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు.సరిగ్గా ఈరోజు కూడా అదే ఎపిసోడ్ తో సీరియల్ మొదలవుతుంది. నిరుపమ్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే.. హిమ వచ్చి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని. కార్ డ్రైవ్ చేస్తుంది. బావా సారీ.. నీ మనసు కాస్త కుదుట పడుతుందని ఇలా తీసుకుని వెళ్తున్నా’ అంటూ మాట కలుపుతుంది. అయితే నిరుపమ్ నిస్సహాయంగా చూస్తూ.. ‘గాయం చేసేది నువ్వే.. మందు రాసేది నువ్వేనా హిమా అంటాడు.
పాపం హిమ మనసులోనే నన్ను క్షమించు బావా.. నీకు నిజం చెప్పలేకపోతున్నా’ అనుకుంటూ అల్లాడుతుంది.సీన్ కట్ చేస్తే జ్వాలను సౌందర్య ఒక చోటకు తీసుకుని వెళ్తుంది.సౌర్య నవ్వుతూ.. ‘ఏంటీ సీసీ నన్ను కిడ్నాప్ చేస్తున్నావా? అసలు నన్ను కిడ్నాప్ చేస్తే ఏం వస్తుంది. ఆ ఆటో తప్పితే అంటుంది.ఇంతలా ఎలా ఉంటావే నువ్వు.. నవ్వుతూ.. నీకు బాధలే ఉండవా?’ అంటుంది సౌందర్య.సౌర్య ఓ చిన్న నవ్వు నవ్వి.. ‘ఏం అయ్యింది సీసీ..’ అనగానే.. సౌందర్య హిమ చేసింది గుర్తు చేసుకుని కళ్లనీళ్లు పెట్టుకుంటుంది. ‘అయ్యో సీసీ ఏంటిది అని నాకెప్పుడూ ఒక డౌట్ ఉంటుంది. మనిషికి బాధొచ్చిన ప్రతిసారీ లోపల నుంచి నీళ్లు ఎలా వస్తాయి.. ఆ నీళ్ల ట్యాంక్ మనిషిలో ఎక్కడుంటుందా? అని.. నాకు కానీ ఆ నీళ్ల ట్యాంక్ ఎక్కడుంటుందో తెలిస్తే.. ముందు దాన్ని ఆపరేషన్ చేయించి తీయించేయాలనిపిస్తుంది..’ అంటుంది సౌర్య.
సరేగాని నువ్వు చిన్నప్పుడు ఏం అవ్వాలని అనుకునేదానివే అని సౌందర్య అంటే సౌర్య ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది.కలెక్టర్‌గా సౌర్య వస్తే అప్పట్లో దీప ముసలమ్మలా వేషం వేసుకుని సౌర్యని అలా కలెక్టర్‌గా చూసుకుని మురిసిపోతుంది. ఆ సీన్ గుర్తు చేసుకుని ‘కలెక్టర్’ అంటూ సమాధానం ఇస్తుంది జ్వాల.మరి ఎందుకు కాలేకపోయావే.. చదువు మానేసి ఈ ఆటో నడుపుకుంటున్నావా? అయినా నిన్ను కాదే.. మీ నాన్నని అనాలి అని సౌందర్య తెలయకుండానే కార్తీక్‌ని తిడుతుంది
‘సీసీ ప్లీజ్ ఆపు.. మా నాన్నని ఏం అనకు మా నాన్న హీరో.. మా నాన్నని దేవుడి కంటే ఎక్కువగా భావించాను కాబట్టి ఆ దేవుడికి కోపం వచ్చి తన దగ్గరకు పిలిపించుకున్నాడు..’ అంటూ కళ్లనిండా నీళ్లతో చెబుతుంది జ్వాల. దాంతో ‘సారీని మీ నాన్న చనిపోయారా’ అంటూ జాలి పడుతుంది సౌందర్య.
ఇక హిమ కారు ఆ ములసమ్మ ఇంటి ముందు ఆపుతుంది. ‘బావా ఇక్కడొక ముసలావిడ ఉందట.. నాన్నమ్మ చెప్పింది. ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ముసలమ్మ దగ్గరకు వెళ్లేసరికి జ్వాల ఆటో కనిపిస్తుంది.అమ్మో సౌర్య ఇక్కడేం చేస్తుంది? ఆటో ఉంది? ఇప్పుడు నేను ఆమె దగ్గరకు వెళ్తే సౌర్య కంట హిమలా బయట పడాల్సి వస్తుందేమో’ అనుకుంటూ అక్కడ నుంచి కారు తీసుకుని వెనక్కి వెళ్లిపోతుంది హిమ.
ఇక కాసేపటికి సౌందర్య.. సౌర్యని తీసుకొచ్చి ఆటో దగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్తుంది. మరోవైపు స్వప్న సత్య ఇంటికి వెళ్లి.. ‘నిరుపమ్‌ని జాగ్రత్తగా చూసుకోండి.. ఆ హిమ జోలికి పోకుండా చూసుకోండి అని చెప్పి వెళ్తుంది.ఇక సౌందర్య ఇంటికి వెళ్లి తీవ్రంగా ఆలోచిస్తుంటే.. సౌర్య కాల్ చేస్తుంది.చాలా సేపు సౌందర్య ’హలో హలో ఎవరు మాట్లాడరేంటీ‘ అని తిడుతుంది. అప్పుడు సౌర్య.. ‘నాన్నమ్మా’ అంటుంది ప్రేమగా.. సౌందర్య షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో నాన్నమ్మా నేను సౌర్యని మరిచిపోయావా?’ అని మాట్లాడుతుంది సౌర్య సౌందర్యతో.ఫోన్ పెట్టేయగానే.. సౌందర్య హిమని పిలిచి.. చాలా ఆనందంగా జరిగింది చెబుతుంది. షాక్ అయిపోతుంది హిమ.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…