Subscribe for notification
Categories: సినిమా

Karthika Deepam: జ్వాలని అన్యాయంగా రోడ్డు మీద వదిలేసి శోభతో వెళ్ళిపోయిన నిరూపమ్..??

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో స్వప్న… శోభను సౌందర్య, ఆనందరావులకు పరిచయం చేయాదంతో పాటు శోభనే నా పెద్ద కోడలు అని కూడా చెప్పి ఇద్దరికి షాక్ ఇస్తుంది. మరోవైపు నిరుపమ్‌.. జ్వలతో ఆటో నడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కధలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చూద్దామా.. హాస్పిటల్ కి వచ్చిన శోభ తనని తాను హిమకు పరిచయం చేసుకుంటుంది. ఇంతలో స్వప్న కూడా వచ్చి శోభను పరిచయం చేస్తుంది.

karthika deepam latest episode

నిరూపమ్ జ్వాలతో ఆటోలో బయటకు వెళ్లాడని తెలిసి స్వప్న రియాక్షన్ ఏంటి..?

సరేగాని నిరుపమ్ ఎక్కడ ఉన్నాడని హిమను అడుగుతుంది. హిమ ఆలోచిస్తూనే ఆటోలో జ్వలతో బయటకు వెళ్లాడని సమాధానం చెబుతుంది.అది విన్న స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది.వెంటనే నిరుపమ్‌కు ఫోన్ చేస్తుంది స్వప్న. కానీ ఆటో నడుపుతున్న నిరుపమ్‌ ఎన్ని సార్లు స్వప్న ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడు.ఇక ఆటో జ్వాల, నిరుపమ్ ఇద్దరు కూడా ఆటో నడుపుకొని ఓ అనాథశరణాలయానికి వస్తారు. చుడండి డాక్టర్ సాబ్ ఇక్కడ ఉన్న వాళ్లకు ఎలాంటి ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ఎంతో ఆనందంగా ఉన్నారని చెబుతుంది జ్వాల. కానీ కొందరు మాత్రం అన్నీ ఉన్నా ఆనందం మాత్రం కనిపించదని క్లాస్ తీసుకుంటుంది. జ్వాల మాటలకు నిరూపమ్ కాస్త నవ్వి తన చేయిని చేతిలోకి తీసుకొని నువ్వు గ్రేట్ అంటాడు.నువ్వు మా ఫ్యామిలీ కోసమే పుట్టావేమో అని పొగిడేస్తాడు.ఇక జ్వాల ఒక్కసారిగా ఆ మాటతో డ్రీమ్‌లోకి వెళ్లిపోతుంది.

karthika deepam latest episode

శోభ నా పెద్దకోడలు అంటూ హిమకు పరిచయం. చేసిన స్వప్న :

ఇంతలో మళ్లీ ఫోన్ మోగుతుంది.మళ్ళీ కట్ చేస్తాడు నిరుపమ్.ఆసుపత్రిలో శోభతో కలిసి ఉన్న స్వప్న ఇంకా నిరుపమ్‌ ఫోన్‌ కోసం ట్రై చేస్తుంటుంది.నిరూపమ్ ఫోన్ తీయకపోయేసరికి మండిపడుతుంది. ఇక వెళ్లిపోతూ డాక్టర్‌ శోభాదేవియే తనకు కాబోయే పెద్ద కోడలని హిమతో చెబుతుంది. అది విన్న హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. త్వరలోనే శుభలేఖలు పంపిస్తానని చెప్పి వెళ్లిపోతుంది.ఇక హిమ మనసులో చాలా టెన్షన్ పడుతూ ఇదేంటి అత్తయ్యా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని మనసులో మదనపడుతూ నిరుపమ్‌తో జ్వాలకు పెళ్లి చేస్తా అని తాను ఇచ్చిన మాట తనదేనని గుర్తుకు వస్తుంది.

karthika deepam latest episode

శోభ ఎంట్రీతో జ్వాల షాక్ :

జ్వాల,నిరుపమ్‌ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడకి డాక్టర్ శోభ ఎంట్రీ ఇస్తుంది నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తుంది జ్వాల. శోభ కూడా అదే ప్రశ్న వేస్తుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.ఇంతలో నిరుపమ్‌ వచ్చి శోభను విష్‌ చేసి పక్కనే ఉన్న జ్వాలను పరిచయం చేస్తాడు. మేము ఇద్దరం చాలా మంచి స్నేహితులమని, మా మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవని అంటాడు నిరుపమ్. వీళ్లిద్దరి క్లోజ్‌ నేస్‌ చూసి జ్వాల కుళ్లుకుటుంది.అయినాగాని ఆటోవాలాకు డాక్టర్‌ సాబ్‌తో పరిచయమేంటని ఆశ్చర్యకరంగా ప్రశ్నిస్తుంది. ఏంటి శోభ సడెన్ సర్ప్రైజ్ అసలు ఇక్కడకు ఎలా వచ్చావని అడుగుతాడు నిరుపమ్.

జ్వాలను వదిలేసి శోభతో వెళ్ళిపోయిన నిరూపమ్ :

ఆంటీతో కలిసి వచ్చానని బాంబు పేలుస్తుంది. ఇంతలో నిరూపమ్ అమ్మని కూల్ చేయడానికి వెళ్తాడు.నిరుపమ్ అలా వెళ్లిన వెంటనే శోభ, జ్వాల మధ్య మరోసారి గొడవ మొదలువుతుంది.ఇంతలో స్వప్న శోభను పిలవడంతో,శోభ నిరుపమ్‌ను ఆటోలో రావడమేంటి పద కారులో వెళ్దాం రమ్మంటుంది. ఇక నిరూపమ్. తాను వెళ్లకపోతే శోభ ఫీల్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం ఆ మాట విన్న జ్వాల కూడా మనసులో బాగా ఫీల్ అవుతుంది.ఇక రేపటి ఎపిసోడ్ లో సౌందర్య… శోభ గురించి హిమకు చెప్తుంది.. అలాగే జ్వాల డాక్టర్ సాబ్ కోసమని భోజనం తీసుకుని స్వప్న ఇంటికి వెళ్తుంది.


Share
Ram

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

39 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

1 hour ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago