Subscribe for notification
Categories: సినిమా

Karthika Deepam: జ్వాలకు దగ్గర అయ్యి ఒకేసారి హిమకు, శోభకు షాక్ ఇచ్చిన నిరూపమ్..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో నిరుపమ్ ఇంట్లోకి జ్వాలా వెళ్లడంతో జ్వలను చూసి స్వప్న, శోభలు ఇద్దరు కూడా షాక్ అవుతారు.సరిగ్గా ఈరోజు కూడా అదే ఎపిసోడ్ తో సీరియల్ ప్రారంభం అవుతుంది.ఇక జ్వాల తనదైన స్టైల్ లో డబ్బులైనా, మనుషులైనా పోగొట్టుకుంటే తిరిగి రావడం కష్టం అని డైలాగ్స్ వేస్తుంది.ఇక చివరగా జ్వాల వెళ్లిపోతూ డాక్టర్ సాబ్ వెళ్లొస్తా ఆరోగ్యం జాగ్రత్త అని స్పప్ప వైపు చూస్తు చెబుతుంది.. ఆ తరువాత శోభ వైపు చూస్తూ అయినా ఈ ఇంట్లో డాక్టర్లుండగా మీకు స్పెషల్ గా ఆరోగ్యం గురించి జాగ్రత్త అని నేను చెప్పాలా అనడంతో స్వప్న, జ్వాల ఇద్దరు ఫైర్ అవుతారు. ఇక కాసేపు జ్వాల,శోభ ఇద్దరు కూడా తగ్గేదేలే అంటూ పొట్లాడుకుని వెళ్ళిపోతారు.

karthika deepam latest episode

హిమ ఊహల్లో ప్రేమ్ :

సీన్ కట్ చేస్తే ప్రేమ్… హిమను తలుచుకుని బాధ పడుతూ ఉంటాడు. హిమ అలా అందరి ముందు నిరుపమ్‌ని పెళ్లి చేసుకోను అని ధైర్యంగా చెప్పింది.ఒకవేళ నా మీద ప్రేముందా? లేదా? నేను అయిన నా ప్రేమ విషయం చెప్పాలి కదా? అని హిమ గురించి ప్రేమ్ తెగ ఆలోచిస్తుంటాడు. ఇంతలో ప్రేమ్ నాన్న సత్యం వచ్చి ఏంట్రా ఈ మధ్య చాలా బాధగా కనిపిస్తున్నావు..ఎమన్నా పోగొట్టుకున్నావా అంటే మనసు పోయింది డాడీ అని మనసులో. అనుకుంటాడు. ఒకవేళ మీ అమ్మ కోసం బెంగపెట్టుకున్నావా ఏంటి..వెళ్తావా? అని సత్యం అంటే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లను డాడీ అంటాడు.ఒంటరివి అవుతావ్.. అయినా నేను అమ్మను భరించలేను అంటాడు.

karthika deepam latest episode

జ్వాల మీద కోపంతో రగిలిపోతున్న శోభ:

మరోపక్క జ్వాల కొట్టిన దెబ్బను శోభ తలుచుకుంటూ మండిపోతుంటుందినా ముందు చాలా సమస్యలున్నాయ్ అన్నిటిని తీర్చాలి.ముందు ఆ ఆటోదాని ఇళ్లు ఎక్కడో తెలుసుకోవాలి.. అసలే నిరుపమ్‌ది జాలి గుండె.. హిమ మీద కోపంతో ఆటోదానికి దగ్గరవుతాడు.. తాళి కడతాడు..అనుకుంటుంది.నేను నిరుపమ్‌కు దగ్గరవ్వాలంటే హాస్పిటల్‌లోనే ఉండాలి అని అనుకుంటుంది.. మరోపక్క ఇంద్రుడు తాగి రోడ్డుమీద తులుతు రావడం చూసి జ్వాల ఇంద్రుడికి క్లాస్ పీకుతుంది.

karthika deepam latest episode

నీకు మంచి మొగుడు వస్తాడు అని జ్వాలను ఆశీర్వదించిన సౌందర్య:

అదే సమయంలో అక్కడకి సౌందర్య వస్తుంది. పడిపోతున్న ఇంద్రుడిని పట్టుకుంటుంది. మా బాబాయ్.. సిసీ.. అప్పుడప్పుడు తాగుడు అలవాటుంది అని చెబుతుంది. అప్పుడప్పుడూ ఏంటి.. ఎప్పుడూ తాగుతుంటాను అంటాడు. ఇలా చేస్తుంటే నీకు కోపం రావడం లేదు.. ప్రేమే కనిపిస్తోంది.. నా బాబాయ్ మీద నాకు కోపం ఎందుకు అంటుంది. అయినాగాని మీ కొడుకు తాగి వస్తే ఇంట్లోకి రానివ్వరా? ఏంటి? అని జ్వాల అడగడంతో నిరుపమ్‌ను గుర్తు తెచ్చుకుంటుంది సౌందర్య. నా కొడుకును గుర్తు చేసి టచ్ చేశావ్.. నీకు మంచి మొగుడు వస్తాడు.

జ్వలకు దగగ్గర అయ్యి శోభకు షాక్ ఇచ్చిన నిరూపమ్ :

ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోయిన విషయం శోభాకు చెబుతాడు నిరుపమ్. హిమ ఎందుకు అలా చేసిందో తెలియడం లేదు.తన మనసులో నేనున్నాను అనిపిస్తుంది.. అని నిరుపమ్ అంటాడు. అంటే హిమ మనసులో ఇంకా నువ్ ఉన్నావని అనుకుంటున్నావా? నిరుపమ్ అని శోభా అడుగుతుంది. అవును అని అంటాడు నిరుపమ్. అయితే ఆడవాళ్లకు ఈ ప్రేమ విషయంలో ఎక్కువగా జెలస్ ఉంటుందట.హిమ ముందు నువ్ వేరే అమ్మాయితో ఎక్కువగా క్లోజ్‌గా ఉన్నట్టు నటించు అని ఐడియా ఇస్తుంది. నీకు దగ్గరగా ఉండేది నేనే కదా?.. నాతోనే క్లోజ్‌గా ఉంటాడు అని అనుకుంటుంది మనసులో.ఆ మాత్రం చాలు.. నిరుపమ్‌ మనసు నా వైపు తిప్పుకోవడానికి.. అని శోభా అనుకుంటుంది. ఇంతలో అక్కడకు జ్వాల వస్తుంది.. ఏంటి డాక్టర్ సాబ్ బిజీగా ఉన్నారా? అని అంటుంది.అదేమీ లేదు అని మీ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని, హిమ ఎక్కడ ఉంది అని అడుగుతాడు నిరుపమ్. బయటే ఉందని జ్వాల చెప్పడంతో సరే పదా వెళ్దామని జ్వాల చేతిని పట్టుకుని మరీ నిరుపమ్ తీసుకెళ్తాడు. అది చూసి శోభా కుళ్లుకుని చచ్చిపోతుంది. అలా ఆ జోడిని చూసి హిమ సంబరపడుతుంది.శోభ మాత్రం మనసులో దీన్ని ఎలాగయినా నాకు అడ్డు తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ఇక నిరూపమ్, హిమ, జ్వాల ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్ళటంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.


Share
Ram

Recent Posts

Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…

10 mins ago

Rakul Preet Singh: ఆ కుర్ర హీరోతోనే మరో సినిమా చేస్తోన్న రకుల్.. అసలేం జరుగుతోంది..?

Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్‌పైనే…

57 mins ago

Dil Raju: ఇండస్ట్రీలో మరో సంచలనానికి తెర లేపిన దిల్ రాజు..??

Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…

2 hours ago

Today Horoscope: జూలై 5 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…

4 hours ago

Samantha Tapsee: సమంత సినిమా పై క్లారిటీ ఇచ్చిన తాప్సి..!!

Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…

7 hours ago

God Father: చిరంజీవి “గాడ్ ఫాదర్” లుక్ అదరగొట్టేసింది.. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ టాక్..!!

God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…

8 hours ago