Subscribe for notification
Categories: సినిమా

Karthika Deepam: హిమ మీద కోపంతో జ్వాలకు దగ్గర అవుతున్న నిరూపమ్… స్వప్నకు చుక్కలు చూపించిన ఇంద్రుడు, చంద్రుడు..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమ మీద కోపంతో నిరూపమ్.. జ్వాలతో క్లోజ్ గా ఉంటాడు. వాళ్ళను చూసి హిమ చాలా సంతోషపడుతుంది. అదే సమయంలో శోభా, స్వప్న ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతు ఉంటారు. ఎలాగయినా ఆ ఆటో వాలాను. నిరూపమ్ కు దూరం చేయాలనీ అనుకుంటారు. ఈరోజు కూడా అదే సీన్ తో సీరియల్ ప్రారంభం అవుతుంది. జ్వాల తెలివితేటలకన్నా.. నిరుపమ్ మంచితనం చూస్తేనే నాకు భయం వేస్తుంది అని స్వప్న భయపడుతుంటుంది.. మీరు భయపడకండి ఆంటీ నేను ఉన్నా కదా అని అభయం ఇస్తుంది శోభ.అలా కాదు శోభ ప్రేమ్ కాస్త గడుసుగా ఉంటాడు గానీ నిరుపమ్ మరీ మెతక.. వాడి భవిష్యత్తును తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అంటుంది స్వప్న.ఆంటీ నిరుపమ్ భవిష్యత్తు నాదని ఫిక్స్ అయిపోయిండి అని శోభా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

karthika deepam latest episode

మోనిత కొడుకుని దూరం పెట్టిన జ్వాల :

సీన్ కట్ చేస్తే మోనిత కొడుకు ఆనంద్. అలియాస్ రవ్వ ఇడ్లీ దగ్గరకు హిమ వస్తుంది. వచ్చి రావడంతోనే ఏరా ఈ మధ్య జ్వాల నీదగ్గరకు వస్తుందా? అని అడిగితే రావడం లేదక్క అని చెబుతాడు రవ్వ ఇడ్లీ. ఎందుకో ఈ మధ్య నా దగ్గరకు రావడం లేదు.నన్ను దూరందూరంగా ఉంచుతోంది అని బాధ పడతాడు. అక్కా నువ్ కూడా నాకు దూరమవుతావా? అని రవ్వ ఇడ్లీ హిమను అడుగుతాడు.. నువ్వు నా తమ్ముడివి అని టైం వచ్చినప్పుడు చెబుతారా అని నీకు ఏదన్నా కావాలంటే నన్ను అడిగి తీసుకో అని డబ్బులిస్తుంది. ఇదంతా కూడా దూరం. నుంచి జ్వాల చూస్తుంటుంది.ఈ తింగరేంటి రవ్వ ఇడ్లీ మీద అంత ప్రేమను చూపుతోంది అని మనసులో అనుకుని అక్కడ నుండి వెళ్లిపోతుంది.

karthika deepam latest episode

స్వప్న పని పట్టిన ఇంద్రుడు, చంద్రుడులు :

సీన్ కట్ చేస్తే ఇంద్రుడు, చంద్రమ్మలు. స్వప్నకు ఎలాగయినా బుద్ధి చెప్పాలి…మా జ్వాలమ్మ ఆటోని తగలబెడుతుందా అని ప్లాన్ వేసి మరి స్వప్న వస్తున్న కారుకి పంచర్ చేస్తారు. అయ్యో కరెక్ట్ టైంకి ఫంక్షన్‌కి వెళ్తుంటే ఈ టైర్ పంక్ఛర్ అయింది.. ఇక్కడ ఎవరైనా వేస్తారో వేయరో అని స్వప్న అనుకుంటు ఉండగా ఇంతలో కారు టైరుకి పంక్ఛర్‌లు వేస్తాం అని చంద్రుడు వస్తుంది.. నువ్ టైరుకు పంక్చర్లు వేస్తావా? అని అడుగుతుంది స్వప్ప. హ అవును అమ్మా మా వంశవ‌ృత్తే ఇది అని అంటుంది.మరి డబ్బులెంత ఇస్తావ్ అని అంటే రెండొందలు ఇస్తాను అంటుంది స్వప్న.. లేదు రెండు వేలు ఇస్తే గానీ చేయను అని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంది. ఇంతులో గండ కూడా వస్తాడు టైర్ పంచర్ వేయాలి. ఈ స్టెపినీ కాస్త బిగిస్తావా? అని స్వప్న అడిగితే.. ఎవరో శంకుస్థాపన చేసినదానికి నేను రిబ్బన్ కటింగ్ ఎలా చేస్తాను అని నాలుగు వేలు ఇస్తే చేస్తాను అనడంతో చేసేది లేక నాలుగు వేలు ఇవ్వడంతో టైరుకు పంక్చర్ వేసి. స్వప్నతో కాసేపు ఇద్దరు ఆడుకుంటారు.

karthika deepam latest episode

డాక్టర్ సాబ్ ఊహల్లో జ్వాల :

మళ్ళీ సీన్ జ్వాలతో ఓపెన్ అవుతుంది. జ్వాల తన ఇంట్లో నిరుపమ్ ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతుంది.ఇంతలో చంద్రుడు వస్తుంది. సినిమా చూస్తున్నావా అంటే లేదు అని. చెబుతుంది. ఇక జ్వాల మాత్రం నిరూపమ్ ఫోటో చూస్తూ ఎప్పుడు మా ఇంట్లోకి అల్లుడిగా అడుగు పెడతావ్ అని అనుకుంటుంది.మరి మీ ఇంట్లోకి నేను కోడలిగా వస్తే.. ఏం చేస్తావ్. మీ అమ్మ ఒప్పుకుంటుందో లేదో నువ్వేమో ఎదురు తిరిగి మాట్లాడవు.. నేనే ఏదో ఒక ప్లాన్ వేయాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది.ఇంతలో సేట్ ఫోన్ చేయడంతో.. పిన్ని బయటకు వెళ్తున్నా అని పిన్నితో చెబుతుంది జ్వాల. తినకుండా వెళ్తున్నావ్ ఏంటి ఏదన్నా తిని వెళ్ళు అని జ్వాల మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది చంద్రుడు.సేట్ పిలిచాడు.. సామాన్ల కోసం.. వెళ్లి రెడీగా ఉండాలి వచ్చాక తింటా అని వెళ్ళిపోతుంది.

హిమకు తన ప్రేమ విషయం చెప్పనున్న ప్రేమ్ :

ఇక హిమతో మాట్లాడేందుకు హాస్పిటల్ వద్దకు వస్తాడు ప్రేమ్. వచ్చి రావడంతోనే హిమ ఏమైంది నీకు.. నిరుపమ్‌తో పెళ్లి ఎందుకు వద్దన్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. ఈరోజు ఎలా అయినా నా ప్రేమ విషయం నీకు చెప్పాలి అని అనుకుంటాడు.సరే హిమ రా కారులో కూర్చో నీతో చాలా మాట్లాడాలి అని కారు డోర్ తీస్తాడు. కానీ కారులో ఎక్కకుండా అలా నడుచుకుంటూ వెళ్దామన్నట్టుగా చెబుతుంది హిమ. సరే అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు.ఇక జ్వాలకు సెట్ ఫోన్ చేసి అమ్మా.. సామాన్లు తీసుకెళ్లాలి ఐదు నిమిషాల్లో రావాలి అని ఫోన్ చేస్తాడు. త్వరగానే వస్తాను..అని జ్వాల చెబుతుంది.ఇంతలో జ్వాల ఆటో క్లచ్ వైర్ తెగిపోవడంతో అబ్బా ఇది ఇప్పుడే తెగిపోవాలా?అని క్లచ్ వైర్‌ను సెట్ చేసుకుంటూ ఉంటుంది జ్వాల. ఇక ఇంతోలోనే నిరుపమ్ జ్వాల దగ్గరకు వచ్చి ఎంతైనా జ్వాలా కష్టజీవి.ఏ పని అయినా ఇష్టంగా చేస్తుంది. అదే తనలోని గొప్పదనం అని కారు దిగుతాడు.

జ్వాల నువ్వంటే నాకు ఇష్టం అన్న నిరూపమ్:

జ్వాల నువ్వంటే నాకు ఇష్టం అని అనగానే జ్వాల కూడా మురిసిపోతుంది.ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ సేట్ పోన్ చేస్తాడు. ఎక్కడికి.. అని నిరుపమ్ అంటాడు. సేట్ దగ్గరికి సామాన్లు తీసుకొని రావాలి అని జ్వాల చెబుతుంది.నువ్వు రావాట్లేదని చెప్పు.. నాతో రా అని నిరుపమ్ అంటాడు. కానీ సేట్‌కు వస్తాను అని మాట ఇచ్చాను అంటే నేను చెబుతాను కదా?. అని జ్వాల ఫోన్ తీసుకునేందుకు నిరుపమ్ ప్రయత్నిస్తాడు. కానీ జ్వాల తన ఫోటో ఎక్కడ చూస్తాడో అని ఫోన్ ఇవ్వకుండా వద్దు డాక్టర్ సాబ్ అని సుమతికి కాల్ చేసి చమన్లాల్ సేట్ దగ్గరకు వెళ్లి సరుకులు తీసుకో అని చెబుతుంది జ్వాల. డాక్టర్ సాబ్ పదండి వెళదాం అంటుంది జ్వాల. సరే జ్వాల ఆ తింగరికి ఫోన్ చేసి తనని కూడా మనం కలిసే రెస్టారెంట్‌కు రమ్మను చెప్పు తనకు సర్ ప్రైజ్ ఇద్దాం.. అని అంటాడు. ఇక జ్వాల ఫోన్ చేసి హిమను అక్కడకు రమ్మని చెబుతుంది.నెక్స్ట్ ఎపిసోడ్ లో హిమ రెస్టారెంట్ కు రావడంతో కధనం మరింత ఆసక్తిగా మారిందనే చెప్పాలి.


Share
Ram

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

8 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

38 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago