Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్ లో స్వప్న, సత్యంల పెళ్లి రోజును ఘనంగా చేయాలనీ నిరూపమ్, ప్రేమ్ ఇద్దరు కూడా ఏర్పాట్లు బాగా చేస్తారు.ఈ ఫంక్షన్ వంకతో హిమకు ప్రేమ విషయం చెప్పాలని ప్రేమ్, నిరూపమ్ ఇద్దరు అనుకుంటారు. కానీ జ్వాల మాత్రం డాక్టర్ సాబ్ కు నా ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటుంది. మరోపక్క హిమ ఎక్కడ జ్వలకు నిజం తెలిసిపోతుందో అని మనసులో కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే సత్యం స్వప్నకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది స్వప్న. వీళ్లిద్దరు వెళ్లేసరికి అందరూ విష్ చేయడం మొదలుపెడతారు.ఒక్క నిరుపమ్ మినహా ఎవరు శుభాకాంక్షలు చెప్పినా మనసులో ఓర్చుకోలేకపోతుంది స్వప్న.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దొంగనోట్ల కేసులో జ్వాలను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు
సీన్ కట్ చేస్తే కారులో వస్తున్న ఫంక్షన్ కు వస్తున్న జ్వాలను దారి మధ్యలో పోలీసులు ఆపి చెకింగ్ చేస్తారు. జ్వాల కారు దిగి తాను ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెబుతుంది. ఇంతలో పోలీసులు కారు డిక్కీ తెరిచి చూస్తారు. అందులో దొంగనోట్లు, బంగారం అన్నీ ఉంటాయి. అవి చూసి పోలీసులతో పాటు, జ్వల కూడా షాక్ అవుతారు. నాకేమి తెలియదు అని చెప్పినా పోలీసులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లమని జ్వాలకు చెప్తారు. చేసేది లేక జ్వల స్టేషన్ కు వెళ్తుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బలవంతంగా స్వప్నతో కేక్ కట్ చేయించిన సత్యం
సీన్ మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గర ఓపెన్ అవుతుంది. సత్యం, స్వప్నలను కేక్ కటింగ్ చేయమంటోంది సౌందర్య. అయితే ఫంక్షన్ లో ఎవరి కంగారులో వారు ఉంటారు. స్వప్నతో బలవంతంగా సత్యం కేక్ కటింగ్ చేయిస్తాడు. వీళ్లిద్దరి ఇలా కలిసి ఉంటే ఎంత బాగుందో అని అందరు అనుకుంటారు.ఇక సౌందర్య ఇప్పుడు నేనొక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తానని,హిమ, నిరుపమ్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు అందరి ముందు ప్రకటిస్తుంది. అంతా చప్పట్లతో మారుమోగిస్తారు. కానీ స్వప్న మాత్రం ఆ మాటలను సహించలేకపోతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముక్కలయిన ప్రేమ్ మనసు
పాపం ప్రేమ్ మనసు అయితే ముక్కలు అయిపోతుంది.ఇక సౌందర్య హిమను పిలిచి నిరుపమ్‌తో కలుపుతుంది సౌందర్య. ఇదంతా చూస్తున్న ప్రేమ్ తన ప్రేమని తలచుకొని బాధపడతాడు.త్వరలోనే వీళ్ళకి. ఎంగేజ్మెంట్ కూడా జరిపిస్తా అంటుంది.ఫంక్షన్ అయిపోయిన తర్వాత నిరుపమ్ పెళ్లి ప్రకటనపై సౌందర్యపై రుద్రకాళిలా విరుచుకు పడుతుంది స్వప్న .
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తల్లి కూతుళ్ళ సవాల్… ఎవరు గెలుస్తారో?
ఇద్దరు కూడా కాసేపు మాట మాట అనుకుంటారు. ప్రపంచంలో ఎవరూ ఎంగేజ్మెంట్ ఆపలేరంటుంది సౌందర్య.చూద్దామంటే చూద్దామని స్వప్న, సౌందర్య ఇద్దరు సవాల్ విసురుకుంటారు.ఇక సౌందర్య పెళ్లి ప్రపోజల్ గురించి అందరికి చెప్పిన తరువాత నిరుపమ్, హిమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా తమ మనసులోని మాటను చెప్పడానికి ఇబ్బందులు పడుతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దగ్గర అవడంతో రేపటి ఎపిసోడ్ ముగుస్తుంది.