Categories: సినిమా

Karthika Deepam: సీరియల్లో జూనియర్ మోనిత ఎంట్రీ అదుర్స్… డాక్టర్ పాపకు చుక్కలు చూపించిన జ్వాల..!!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో సౌర్య సౌందర్యకు కాల్ చేయడం.. హిమ అదంతా స్వప్న ప్లాన్ అయ్యి ఉంటుందని అనుకోవడం తెలిసిన విషయమే. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్‌కి స్వప్న తన గతాన్ని చెప్పడం కధ మరింత రసవత్తరంగా సాగిందనే చెప్పాలి.
ఈరోజు కూడా అదే సీన్ తో సీరియల్ మొదలువుతుంది.ఒరేయ్ నిరూపమ్ అసలు మీ డాడీ నేను ఎందుకు విడిపోయామో తెలుసా అని గతం చెబుతుంది.మీ డాడీ నన్ను పెళ్లి చేసుకోకముందు ఒక అమ్మాయిని ప్రేమించాడట..కానీ కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయిని మీ డాడీ పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తుంటే.. నేను సత్యాని పెళ్లి చేసుకుంటా… వేరే ఎవర్ని పెళ్లి చేసుకోను,పిల్లల్ని కనను అని శపథం చేసిందట.

karthika deepam today episode 21 may 2022

సత్యకు మరో అమ్మాయితో ఏఫైర్ ఉన్న విషయం నిజమేనా..?

అయితే కొన్నాళ్లకు ఆ అమ్మాయి వేరే వాళ్లని పెళ్లి చేసుకుంది కానీ ఇద్దరు పిల్లల్ని మాత్రం మీ డాడీతోనే కనింది.అని స్వప్న చెప్పేసరికి నిరుపమ్ షాక్ అయిపోతాడు.మీ డాడీ నన్ను ఈ రకంగా మోసం చేశాడు కాబట్టే మీ నాన్నని నేను దూరం పెట్టాను.. నేను తనని తలుచుకుని కుమిలిపోవట్లేదు.. నీకు కూడా చెప్పేది అదే నిరుపమ్.. నిన్ను కోరుకున్నవారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.ప్రేమలో మోసపోవడం అనేది మనకు వారసత్వంగా వస్తుందేమో.. మీ నాన్నని నమ్మి నేను మోసపోయాను. ఆ హిమ పెద్ద నష్టజాతకురాలురా ఆ దరిద్రం ఇప్పటితో వదిలింది అని సంతోషించాలి. నువ్వు ఇలా దాన్నే తలుచుకుంటూ ఏం అవుతావో అని భయమేస్తుంది అంటుంది..ఇక నిరుపమ్ అక్కడనుండి ఆవేశంగా పైకి లేచి ‘నేను వెళ్తాను మమ్మీ’ అంటూ ఆగకుండా ఆవేశంగా బయలుదేరతాడు.
<img src=”https://newsorbit.com/wp-content/uploads/2022/05/IMG-20220521-WA0031.jpg” alt=”” width=”1080″ height=”595″ class=”alignnone size-full wp-image-249834″ /

హిమను కొట్టిన కొత్త లేడీ ఎవరబ్బా?

సీన్ కట్ చేస్తే ఎవరో ఒక కొత్త అమ్మాయి కారులో పాటలు పెట్టుకుని వేగంగా వస్తూ ఉంటుంది.ఇంతలో ఓ నర్స్ ఫోన్ చేసి.. ఓ పెషెంట్ గురించి చెబితే వీడియో కాల్ చేయమని అంటుంది. ఆ నర్స్ వీడియో కాల్ చేయగానే.. ట్రీట్మెంట్ అంతా చెబుతుంది. అంటే ఆ అమ్మాయి డాక్టర్ అని అర్ధం అవుతుంది.కారులో ఉన్నా అమ్మాయి వేగంగా కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా హిమ, సౌర్యలు కారులో వస్తుంటారు. అనుకోకుండా కారు సడన్‌గా ఆగిపోతుంది. హిమ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఎదురుగా వస్తున్న ఆ డాక్టర్ హారన్ వేసి వేసి, కారు దిగి వచ్చి హిమని బయటకు రమ్మని హిమ చెంప పగలగొడుతుంది ఆ డాక్టర్..

karthika deepam today episode 21 may 2022

హిమను కొట్టిన డాక్టర్ కు చుక్కలు చూపించిన జ్వల :

ఎవరండి మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు’ అంటూ హిమ అడిగే లోపే సౌర్య ఆవేశంగా ఆ డాక్టర్ ను లాగిపెట్టి కొట్టేస్తుంది.హేయ్ నన్నే కొడతావా? ఎవరే నువ్వు?’ అంటూ రగిలిపోతూ అరుస్తుంది ఆ డాక్టర్. వెంటనే మళ్లీ లాగిపెట్టి కొట్టిన సౌర్య ‘నిన్నే.. నిన్నే కొడతాను.. నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడతాను..అంటుంది.అసలు తనని ఎందుకు కొట్టావ్ అంటే..కారు రోడ్డు మీద ఆపి కబుర్లు చెప్పుకుంటున్నారు…పక్కకు తియ్యాలని తెలియదా?అందుకే కొట్టాను అని అరుస్తుంది ఆ డాక్టర్. ‘ఇది కొట్టకుండా కూడా అడగొచ్చు కదా అనుకోకుండా కారు ఆగిపోయింది అంటుంది జ్వల.కారు కండీషన్‌లో ఉందో లేదో తెలియకుండానే రోడ్ల మీదకు ఎలా వస్తారు అంటుంది.సౌర్య, డాక్టర్ ఇద్దరు. కూడా మాట మాట అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. వీరు గొడవపడడం చూసి ‘అయ్యో జ్వాల నువ్వు ఆగు’ అంటుంది హిమ కంగారుగా.. ‘తింగరీ నువ్వు ఎందుకు భయపడతావ్ మన తప్పు లేనప్పుడు అంటుంది జ్వల.

జ్వల దెబ్బకు హిమకు సారీ చెప్పిన డాక్టర్ పాప:

ఇక వెంటనే డాక్టర్ తో జ్వాల ‘చూడు పాపా.. మాది తప్పు లేదు. అయినా సరే తనని కొట్టావ్.. సో సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే మా వాళ్లని పిలుస్తాను అని బెదిరిస్తుంది.వామ్మో ‘ఇది పెద్ద మాస్‌లా ఉంది.. ఎందుకొచ్చిందిలే’ అని మనసులో అనుకున్న ఆ డాక్టర్ సారీ అనేసి అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే ఆమెకు స్వప్న కాల్ చేసి హాయ్ శోభా.. ఎలా ఉన్నావ్? ఎక్కడున్నావ్’ అంటుంది. అంటే ఆ డాక్టర్ పేరు శోభా అన్నమాట.‘డ్రైవింగ్‌లో ఉన్నాను ఆంటీ.. చెప్పండి’ అంటుంది శోభా.ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లు నిరుపమ్ గురించి నీతో మాట్లాడాల్సి అంటుంది స్వప్న. వెంటనే శోభా కాస్త సిగ్గు పడుతూ.. ‘సరే ఆంటీ వస్తాను’ అంటుంది

జ్వల ప్రేమను గెలిపిస్తా అని మాట ఇచ్చిన హిమ:

సీన్ కట్ చేస్తే హిమని ఒక చోటకు తీసుకుని వెళ్లిన జ్వల డాక్టర్ సాబ్ గురించి తింగరికి చెప్పాలి అని తన మనసులో మాట బయటపెడుతుంది. ‘అవును తింగరీ నువ్వు డాక్టర్ సాబ్‌ని బావా బావా అంటావ్ కదా మరి తనని పెళ్లి చేసుకోవాలని అనిపించలేదా?’ అని అడుగుతుంది జ్వాల. వెంటనే హిమ తన ప్రేమను బయటపెట్టకుండా లేదు అని చెబుతుంది.కానీ డాక్టర్ సాబ్ ను పెళ్లి చేసుకోవాలని ‘నాకు అనిపించింది తింగరీ.. మీ బావని నేను ఇష్టపడుతున్నా.. నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్’ అంటుంది జ్వాల సిగ్గుపడుతూ.. ‘సరే జ్వల అది నా బాధ్యత’ అంటుంది హిమ కాస్త ఎమోషనల్‌గా అవుతూ.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్లో…

6 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

39 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

40 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago