NewsOrbit
సినిమా

కార్తికేయ కొత్త చిత్రం `90 ఎంఎల్‌`

`ఆర్‌.ఎక్స్.100` సినిమా టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఝుమ్‌… ఝుమ్మంటూ సంద‌డి చేసింది. న్యూవేవ్ సినిమాగా, క‌ల్ట్ మూవీగా భారీ విజ‌యాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో ప‌దిలంగా చోటుచేసుకుంది. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్. ఆ సినిమా ద్వారా గొప్ప గుర్తింపు పొందిన హీరో కార్తికేయ‌. ఇప్పుడు మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న నేహా సోలంకి నాయిక‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.
తాజా చిత్రం `90ఎంఎల్‌` గురించి నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ “ఒక మంచి సినిమా తీస్తే ఇండ‌స్ట్రీలో గుర్తింపు ఎలా ఉంటుందో, గౌర‌వం ఎంత గొప్ప‌గా ద‌క్కుతుందో, బాక్సాఫీస్ గ‌ల‌గ‌ల‌లు ఎంత సంద‌డిగా ఉంటాయో మాకు `ఆర్‌.ఎక్స్.100` ద్వారా తెలిసింది. గ‌తేడాది జూలై 12న మా `ఆర్‌.ఎక్స్.100`ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం.మా చిత్రం విడుద‌లై ఏడాది గ‌డిచినా `ఆర్‌.ఎక్స్.100`లాంటి సినిమా అంటూ… సినీ ప్రియులు ఇంకా గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, యావ‌త్ సినీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌నూ దోచుకున్న చిత్ర‌మది. ఈ చిత్రంతో మా హీరో కార్తికేయ‌కు బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఈ ఏడాదిలో ఆయ‌న వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రానికి `90ఎంఎల్‌`అని పేరు పెట్టాం. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఇప్ప‌టికి 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి కొత్త‌వాడైనా బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు.
మా బ్యాన‌ర్ నుంచి వ‌చ్చే చిత్రాలు ఏవైనా స‌రే `ఆర్‌.ఎక్స్.100` విజ‌యప‌రంప‌ర‌ను కొన‌సాగించేవే అయి ఉంటాయి“ అని అన్నారు.
ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ “కార్తికేయ అన‌గానే ఎవ‌రికైనా `ఆర్‌.ఎక్స్.100` గుర్తుకొస్తుంది. ఆ చిత్రం క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. ఎంతో మందికి ఆ సినిమా ఓ రెఫ‌రెన్స్ గా మిగిలింది. వాట‌న్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంత‌కుమించి ఉండేలా `90 ఎంఎల్‌` క‌థ రాసుకున్నాను. పూర్తి స్థాయిలో ఎంట‌ర్‌టైన్ చేసే క‌థ ఇది. క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్ మెండుగా ఉంటాయి. `90 ఎంఎల్‌` అని టైటిల్ చెప్ప‌గానే చాలా మంది `ఇంట్ర‌స్టింగ్‌` అన్నారు. సినిమా కూడా అంతే ఆస‌క్తిక‌రంగా వ‌స్తోంది. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మొత్తం ఆరు పాట‌లున్నాయి. అనూప్ రూబెన్స్ చాలా మంచి ట్యూన్లిచ్చారు. చంద్ర‌బోస్‌గారు యువ‌త‌ను ఆక‌ట్టుకునేలా పాట‌లు రాశారు. `రంగ‌స్థ‌లం` త‌ర్వాత చంద్ర‌బోస్ గారు మ‌ళ్లీ సింగిల్ కార్డు రాసింది మా సినిమాకే. ప్ర‌తి పాటా ఎక్స్ ట్రార్డిన‌రీగా ఉంటుంది. ఇటీవ‌ల `సైరా`లో కీల‌క పాత్ర‌లో న‌టించిన ర‌వికిష‌న్ మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. `90 ఎంఎల్‌` అనే టైటిల్ ఎందుకుపెట్టాం? దాని క‌థాక‌మామీషు ఏంట‌నేది తెర‌మీద చూస్తేనే బావుంటుంది. ఈ నెల 11 నుంచి హైద‌రాబాద్‌లో క్లైమాక్స్ తెర‌కెక్కిస్తాం. దీని త‌ర్వాత మ‌రో షెడ్యూల్లో బ్యాల‌న్స్ టాకీ, 2 పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం. అంత‌టితో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. క‌థ‌, క‌థ‌నం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉంటాయి“ అని అన్నారు.

న‌టీన‌టులు:
కార్తికేయ‌, నేహా సోలంకి (తొలి ప‌రిచ‌యం), ర‌వికిష‌న్‌, రావు ర‌మేశ్‌, అలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, అజ‌య్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్ , స‌త్య‌ప్ర‌కాశ్‌, ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, అదుర్స్ ర‌ఘు, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, తాగుబోతు ర‌మేశ్‌, రోల్స్ రిడా, దువ్వాసి మోహ‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ రెడ్డి ఎర్ర
సంగీతం: అనూప్ రూబెన్స్
పాట‌లు: చంద్ర‌బోస్‌
కెమెరా: జె.యువ‌రాజ్‌
ఎడిట‌ర్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌
ఫైట్స్: వెంక‌ట్‌
నృత్యాలు: ప్రేమ్ ర‌క్షిత్‌, జానీ
కో డైర‌క్ట‌ర్‌: సిద్ధార్థ్ రెడ్డి గూడూరి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. సూర్య నారాయ‌ణ

author avatar
Siva Prasad

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Leave a Comment