కార్తికేయ 2 : ప్రముఖ స్టార్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. కార్తికేయ 2 మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. కార్తికేయ సినిమా సూపర్ హిట్ కావడంతో కార్తికేయ2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి టాక్ వచ్చింది. కమర్షియల్ కథలతో పాటు కొత్తదనాన్ని చూపించే కథలని ఎంచుకొని నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయం సొంతం చేసుకుంటున్న నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై టీ.జీ. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కార్తికేయ2 సినిమాని కలిసి నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ పనులు కూడా ముగిశాయి.
కార్తికేయ 2 : ఆ కాంటెస్ట్ నిర్వహణ
ఈ సినిమాకి ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కార్తికేయ 2 సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీన్స్, కాన్సెప్ట్ చూసి ప్రశంసల వర్షం కురిపించారు సెన్సార్ బోర్డు సభ్యులు. ప్రస్తుతం ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 12న రిలీజ్ అవ్వటానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా ప్రచారం కోసం కొత్త దారిలో వెళ్తున్నారు దర్శక నిర్మాతలు.దీనికోసం ఒక కాంటెస్ట్ చేస్తున్నారు.
గెలిస్తే ఆరు లక్షలు మీవే
Read more: తన ఫస్ట్ లవ్ ఎప్పుడో బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..!!
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కార్తికేయ 2 కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఈ కార్తికేయ 2 కాంటెస్ట్ లో పాల్గొన్ని గెలిచిన విజేతలకు 6 లక్షల విలువ గల ప్రైజ్ మనీ గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు. ఇటీవల హైదరాబాదులో ఫస్ట్ క్లూ విడుదల చేశారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా క్లూస్ ని రిలీజ్ చేస్తామన్నారు దర్శక నిర్మాతలు. దాంతో ప్రేక్షకులకు కార్తికేయ 2 సినిమా పై మరింత ఆసక్తి పెరుగుతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!