`ఆర్.ఎక్స్ 100`తో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరో కార్తికేయ తర్వాత `హిప్పీ`, `గుణ 369` చిత్రాలతో కూడా మెప్పించారు. అయితే `నాని`స్ గ్యాంగ్ లీడర్` కథ నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా విలన్‌గా నటించడానికి ఓకే చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సెప్టెంబర్ 13న నానితో ఢీ అంటే ఢీ అనే విలన్ రోల్లో కార్తికేయ ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ “గత పది సంవత్సరాలుగా నాని గారికి మీ అందరి కన్నా ఎక్కువ ఫ్యాన్‌ని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలనుకే వారికి ఇండస్ట్రీలో కొన్ని పేర్లు కనిపిస్తాయి అందులో మొదటిపేరు మెగాస్టార్ చిరంజీవి, తరువాత రవితేజ. అలా ప్రస్తుత కాలానికి మేమందరం ఇంట్లో గర్వంగా చెప్పుకునే పేరు నాని. ఆయన్ని ఏ విషయంలోనైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక మామూలు మిడిల్‌క్లాస్‌లో పుట్టి మన పక్కింటి అబ్బాయిలా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. ‘ఎంసిఏ’ లాంటి కమర్షియల్ మూవీ తరువాత ‘జెర్సీ’ లాంటి డిఫరెంట్ మూవీ చేశారు“ అన్నారు.
previous post
next post