తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య, అతని సోదరుడు హీరో కార్తి ఉన్నారు. వీరిద్దరూ తమ సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తుంటారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎస్,జి.కె అంటూ రాబోతున్నాడు సూర్య. అలాగే కార్తి కూడా ఖైది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ కిషన్‌తో నగరం(తమిళంలో మా నగరం) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి చేస్తున్న సినిమా ఖైది. ఈ సినిమా కథంతా ఒక రాత్రిలోనే జరుగుతుందట. 62 పాటు జరిగిన చిత్రీకరణంతా రాత్రి పూటనే జరగడం విశేషం. ఒక పగటి సీన్ కూడా ఉండదట. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఉండదు. మరి ఈ ప్రయోగాత్మక చిత్రం కార్తికి ఎంత పేరు తెస్తుందో చూడాలి.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!