RRR: ప్రపంచ సినిమా రంగంలో “ఆర్ఆర్ఆర్” సంచలనంగా మారింది. కారణం చూస్తే ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక పలు అంతర్జాతీయ అవార్డులు వరుస పెట్టి గెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియాలో ₹1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం తెలిసిందే. పాండమిక్ తర్వాత అత్యంత ప్రజాదారణ పొందిన సినిమాగా ఇండియాలో “RRR” కలెక్షన్స్ సాధించింది. “బాహుబలి 2” రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అందరూ భావించిన గాని… చేరుకోలేకపోయింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో “బాహుబలి 2″కీ వచ్చిన పాపులారిటీ కంటే మరీ ఎక్కువగా “RRR” తో రాజమౌళికి పేరు వచ్చింది అని చెప్పవచ్చు.
నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. “RRR” చూసిన చాలామంది హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు దర్శకుడు రాజమౌళిని పొగడటంతో పాటు చరణ్, తారక్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. మరి కొంతమంది హాలీవుడ్ నిర్మాతలు రాజమౌళితో సినిమాలు చేయడానికి కూడా ముందుకొచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకోవటం తెలిసిందే. మొన్ననే సినిమాలో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో “నాటు నాటు” పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవటం జరిగింది.
కాగా తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్… బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణిని ఎంపిక చేసింది. దీంతో ఈ అవార్డు కీరవాణి అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలా భావోద్వేగాకరంగా కీరవాణి స్పీచ్ ఇచ్చారు. “RRR” టీం ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో తెలియజేసింది. దీంతో మెగా మరియు నందమూరి అభిమానులతో పాటు ఇండియాలో ఉండే సినీ ప్రేమికులు.. ఇదే టైంలో ఆస్కార్ కూడా గెలిచేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
.@mmkeeravaani’s acceptance speech for #RRRMovie’s score at @LAFCA. ❤️🔥🔥🌊
— RRR Movie (@RRRMovie) January 15, 2023