Keerthi Suresh: “మహానటి” సినిమా తో అలనాటి అందాల నటి సావిత్రి పాత్ర చేసి సౌత్ ఇండస్ట్రీ లో మహామహులతో శభాష్ అనిపించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ దెబ్బతో “మహానటి” సినిమా ద్వారా అనేక అవార్డులను కీర్తి సురేష్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీ లో అనేక భాషల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తూ ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే ఇటీవల పెళ్లి గురించి రకరకాల వార్తలు గాసిప్స్ వస్తూ ఉండటంతో .. కీర్తి సురేష్ తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది. చెన్నైకి చెందిన బడా వ్యాపారవేత్త తో కీర్తి సురేష్ లవ్ లో ఉన్నట్లు వార్తలు ఇటీవల నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతున్నాయి. దీంతో తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన కీర్తి సురేష్.. ప్రస్తుతానికైతే తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని అనేక సినిమాలు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది.
ఒకవేళ పెళ్లి ఫిక్స్ అయితే ఖచ్చితంగా అందరికీ చెబుతాను ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అనవసరంగా తన పై రూమర్స్ క్రియేట్ చేయొద్దు అని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ఒక కీర్తి సురేష్ కెరియర్ పై మాత్రమే కాక అనేక మంది హీరోయిన్ల పెళ్లిళ్లపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కీర్తి సురేష్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడంతో వస్తున్న వార్తలకు చెక్ చెప్పినట్లయింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!