సినిమా

Mahesh-Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలో 3 సార్లు దెబ్బలు తిన్న మ‌హేష్‌.. అస‌లేమైందంటే?

Share

Mahesh-Keerthy Suresh: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గీతా గోవిందం ఫేమ్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కొద్ది రోజుల క్రిత‌మే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. వ‌రుస అప్డేట్స్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగానే కీర్తి సురేష్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా సినిమా గురించి ఎన్నో విశేషాల‌ను పంచుకున్న కీర్తి.. షూటింగ్ స‌మయంలో మ‌హేష్ త‌న చేతిలో మూడు సార్లు దెబ్బ‌లు తిన్న‌ట్లు కూడా తెలిపింది. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. “మహేష్ బాబుతో షూటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఓ పాట షూటింగ్ సందర్భంగా నేను టైమింగ్ ను మిస్ అయ్యాను. స్టెప్పులు మరిచిపోయి.. మహేష్ ముఖంపై రెండు సార్లు రాంగ్ టైమింగ్ లో కొట్టాను.

మూడోసారి కూడా అదే రిపీట్ అవ్వ‌డంతో నాకెంతో భ‌య‌మేసింది. వెంట‌నే మ‌హేష్ గారికి పదే పదే సారీ చెప్పాను. కానీ ఆయ‌న మాత్రం ఎంతో కూల్‌గా `నా మీద ఏమైనా పగ ఉందా?` అంటూ సరదాగా ఆటపట్టించారు“ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కీర్తి కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సముద్ర ఖని విలన్ గా కనిపించ‌బోతుంన్నారు. అలాగే త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చాడు.


Share

Related posts

Priya Prakash Varrier : ప్రియావారియర్ కల నెరవేరనుందా? మన రౌడీ బాయ్ ఓకే చెప్తాడా?

Ram

Pushpa: పుష్పకు స్పైడర్ మాన్ షాకిస్తాడా..సైడిస్తాడా..!

GRK

అబ్బా అనిపించేలా ఇస్మార్ట్ నభ లేటెస్ట్ హాట్ లుక్స్

sowmya