సినిమా

Keerthy Suresh: అర‌రే.. పాపం కీర్తి సురేష్ కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని అవ‌మానాల‌ను ఎదుర్కొందా?

Share

Keerthy Suresh: కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనక దంప‌తుల కుమార్తె అయిన కీర్తి.. మ‌ల‌యాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ చేసి ఆపై హీరోయిన్‌గా మారింది. ఇటు రామ్ హీరోగా తెర‌కెక్కిన `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఈ ముద్దుగుమ్మ‌.. ఇక్క‌డ మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను ద‌క్కించుకుంది.

ఆ త‌ర్వాత నేను లోకల్ మూవీతో మ‌రో హిట్ అందుకున్న కీర్తి.. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `మ‌హాన‌టి` తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక‌పోతే మంచి సినీ బ్యాంక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. కీర్తి సురేష్ కెరీర్ స్టార్టింగ్‌లో పాపం ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొంద‌ట‌.

Keerthy Suresh Recent Pics
Keerthy Suresh Recent Pics

కెరీర్ ప్రారంభ‌మైన కొత్త‌లో కీర్తి మలయాళంలో చేసిన ఒక సినిమా విడుదలకి నోచుకోలేద‌ట‌. ఆ తరువాత ఆమె సైన్ చేసిన రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో కీర్తి సురేష్‌ది ఐరన్ లెగ్ అంటూ ప్రచారం జరగడం మొదలైంద‌ట‌. ఇక ఆ ప్రచారం నుంచి తాను బయటపడటానికి మూడేళ్లు పట్టింద‌ని, కెరియర్లో సక్సెస్ రావాలంటే ఎంతో కష్టపడాలి. సక్సెస్ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని నేను భావించాను. అందుకే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను` అంటూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

దీంతో ఇప్పుడీమె కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా, `గుడ్ లక్ సఖి` సినిమాతో నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కీర్తి.. మ‌రోవైపు మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తోంది. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కానుంది.


Share

Related posts

Keerthi Suresh: కీర్తి సురేష్ ఈ సాహసం చేయడానికి కారణం ఇదేనట..!!

bharani jella

Chiranjeevi: తన సినిమాలో పూరి జగన్నాథ్ నటించడంపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!

sekhar

బిగ్ బాస్ 4 : మోనాల్ నిజస్వరూపం అఖిల్ కు తెలిసిపోయింది…? కళ్ళు తెరిపించిన నాగార్జున

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar