సినిమా

Keerthy Suresh: `గాంధారి` సాంగ్ వ‌చ్చేసింది.. కీర్తి సురేష్ పెర్ఫామెన్స్ అదుర్స్ అంతే!

Share

Keerthy Suresh: టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ మ‌ల‌యాల ముద్దుగుమ్మ‌.. త‌న‌దైన అందం, అభినయంతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక `మ‌హాన‌టి`లో సావిత్ర త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు పొందింది.

ప్ర‌స్తుతం స్టార్ హీరోల స‌ర‌స‌న సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో దూసుకుపోతోంది. అలాగే సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు చెల్లెల్లుగా కూడా కీర్తి న‌టిస్తోంది. ఇక ఇప్పుడీ బ్యూటీ మ్యూజిక్ ఆల్బమ్ ట్రెండ్‌ని టాలీవుడ్‌లోకి తీసుకొచ్చింది. వాస్త‌వానికి ఈ ట్రెండ్‌ బాలీవుడ్‌లో ఉంది. ఇప్ప‌టికే అక్క‌డ చాలా మంది స్టార్‌ హీరోయిన్లు అలాంటి సాంగ్స్ చేసి.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

అయితే తాజాగా కీర్తి సురేష్ కూడా తొలిసారి ఆల్బ‌మ్ సాంగ్‌ `గాంధారి`లో న‌టించింది. ది రూట్, సోని మ్యూజిక్ సౌత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సాంగ్‌ తాజాగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వం వహించిన ఆ సాంగ్ విడుద‌లైన కొద్ది సేప‌టికే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది.

`గాంధారీ గాంధారీ.. నీ మరిది గాంధారీ .. దొంగ చందమామలాగా వంగి చూసిండే` అంటూ సాగిన ఈ పాట లో కీర్తి సురేష్ పెర్ఫామెన్స్ అదుర్స్ అంతే. లెహంగా ఓణీ ధ‌రించిన ఆమె.. అద్భుతంగా స్టెప్స్ వేసి అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కీర్తి సురేష్ ఎంత మంచి డ్యాన్స‌రో ఈ సాంగ్‌తోనే తేలిపోయింద‌ని కూడా చెప్పొచ్చు. మ‌రి లేట్ చేయ‌కుండా కీర్తి స్పెష‌ల్ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.


Share

Related posts

Rajamouli Mahesh Babu: ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో ఆ టాప్ మాస్ డైరెక్టర్ ప్రాజెక్ట్..??

sekhar

ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదేమో : ఆంధ్ర ప్రదేశ్ కి సోనూ సూద్ ! 

sekhar

బ్రేకింగ్: ఎన్టీఆర్ బావమరిది సినీ ఎంట్రీ ఫిక్స్.. ప్రాజెక్ట్ ఖరారు

Vihari