కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ సినిమా ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లోకి రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకులను మరియు సగటు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. థియేటర్లో సినిమా విడుదలైతే వసూళ్లను బట్టి ఇది హిట్ అయిందా లేదా ఫట్ అయిందా అని తెలుసుకోవచ్చు.
కానీ ఓటిటి లో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల ఒక వినూత్నమైన ప్రామాణికాన్ని తీసుకీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘పెంగ్విన్’ సినిమా ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్కొని సినిమాను యొక్క ఫలితాన్ని తేలుస్తారు.
కీర్తి సురేష్ పాపులారిటీకి తోడు ఈ చిత్రం పట్ల సోషల్ మీడియాలో ఇచ్చిన హైప్ మరియు రేకెత్తించిన ఉత్సుకత చిత్రాన్ని పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించేలా చేసింది. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలలో పెంగ్విన్ కి మొదటి వారాంతంలో వచ్చినన్ని వ్యూస్ మరే చిత్రానికీ రాలేదట.
ఈ చిత్రాన్ని తమిళంతో పాటు, తెలుగు, మలయాళంలో కూడా రిలీజ్ చేయడం కూడా ఇందుకు కారణం అనుకోవచ్చు. ఈ చిత్రం కోసం అమెజాన్ పెట్టిన పెట్టుబడి వర్కవుట్ అయిపోయిందట. అలాగే ఇక మీదట వచ్చే వ్యూస్ నుంచి నిర్మాతకు కూడా షేర్ వెళ్తుందట.
ఒక పాపులర్ హీరోయిన్ లేదా పాపులర్ హీరో ఉన్న సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయితే ఉండే సానుకూలత ఇదే. సినిమా అటు ఇటు గా ఉంది అన్నా మన ఫోన్లోనే చూసేయొచ్చు కాబట్టి అలా ఖాలీ సమయంలో ఓపెన్ చేస్తారు. అదే సినిమా అయితే సినిమా హాల్ కి వెళ్లి.. టికెట్ తీసుకొని అయిపోయిందా వరకు లోపలే ఉండాలి లేదా బయటకు వచ్చేస్తే టికెట్ వేస్ట్ అనుకుంటారు. సినిమాకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా కానీ, ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది కనుక జనం అదేంటో చూడ్డానికే మొగ్గు చూపుతారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!