కరోనా వైరస్ దెబ్బకు థియేటర్లన్నీ మూతపడగా ఎన్నో సినిమాలు నేరుగా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న ఓటిటి ప్లాట్ఫామ్స్ లోకి విడుదల అయిపోతున్నాయి. అయితే నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వారే సమర్పిస్తున్న ‘పెంగ్విన్’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల కాగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది.
ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ విషయానికి వస్తే అజయ్ అనబడే ఒక చిన్న పిల్లాడు తప్పిపోతే అతని వెతుకులాట నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో అజయ్, కీర్తి సురేష్ యొక్క కొడుకు అయి ఉండొచ్చు కానీ కొన్ని సీన్లలో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ గా కనపడటం కూడా విశేషం. ఇకపోతే ఒక సైకో కిల్లర్ చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి చాలా ఘోరంగా హింసించి చంపుతూ ఉండగా వారిని వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కొడుకు అజయ్ కూడా కనపడకుండా పోతే అతని కోసం కీర్తి సురేష్ ఒంటరిగా వెతుకుతుండగా వచ్చే అడ్డంకులను ఎలా అధిగమిస్తుంది అన్నది సినిమా సారాంశం అన్నట్లు ట్రైలర్ లో మనకి కనపడుతుంది.
పైన చూసేందుకు కొద్దిగా రొటీన్ కథలా ఉన్నా ట్రైలర్ లో సినిమాటోగ్రఫీ మరియు సౌండ్ డిజైనింగ్ ఇంకా మెండ్ బ్లోయింగ్ టేకింగ్ చూస్తే ఈ సినిమా ఒక క్లాసిక్ ట్రైలర్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీన నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయ్యే ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బాణీలు సమకూర్చారు.